వరుణ్ తేజ్ పెళ్లితో లబోదిబోమంటున్న సాయిధరమ్ తేజ్.. పెళ్లి సంబంధాలు షురూ ? లేటెస్ట్ పోస్ట్ తో హింట్
టాలీవుడ్ లో ఒక హీరో పెళ్లి చేసుకుంటే సింగిల్ గా ఉన్న మరో హీరో పెళ్లి ఎప్పుడు అంటూ వెంటనే చర్చ మొదలవుతుంది. ఇప్పుడు ఒక రకంగా వరుణ్ పెళ్లి సాయిధరమ్ ని ఇరకాటంలో పెట్టింది అని చెప్పొచ్చు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నవంబర్ 1న వరుణ్ తేజ్ తన ప్రేయసి నటి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ లో వరుణ్ లావణ్య మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
టాలీవుడ్ లో ఒక హీరో పెళ్లి చేసుకుంటే సింగిల్ గా ఉన్న మరో హీరో పెళ్లి ఎప్పుడు అంటూ వెంటనే చర్చ మొదలవుతుంది. ఇప్పుడు ఒక రకంగా వరుణ్ పెళ్లి సాయిధరమ్ ని ఇరకాటంలో పెట్టింది అని చెప్పొచ్చు. సాయి ధరమ్ తేజ్ వయసు వరుణ్ తేజ్ కన్నా ఎక్కువ. ఈ క్రమంలో వరుణ్ పెళ్లి చేసుకుంటే తేజు మ్యారేజ్ ఎప్పుడు అనే డిస్కషన్ సహజంగానే ఉంటుంది.
సాయిధరమ్ ధరమ్ తేజ్ గతంలో ప్రేమ వ్యవహారాల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ విషయాన్నీ తేజునే స్వయంగా కొన్ని సందర్భాల్లో రివీల్ చేశాడు. కానీ పెళ్లి వరకు వెళ్ళలేదు. వరుణ్ పెళ్లితో ఇప్పుడు తేజు పెళ్లి వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. వీలైనంత త్వరగా సాయిధరమ్ తేజ్ కి వివాహం చేయాలనీ కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. సంబంధాలు కూడా మొదలైనట్లు ప్రచారం జోరందుకుంది.
ఈ విషయంలో తేజు కూడా తాజాగా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చాడు. వరుణ్ తేజ్ పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ సెటైరికల్ కామెంట్స్ చేశాడు. 'ఎందుకు, వై, క్యో, ఎన్ ? ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు.. నీకు పెళ్లి సంబరాలు..నాకు స్వతంత్ర పోరాటం' అంటూ తేజు ఫన్నీ పోస్ట్ పెట్టాడు. స్వతంత్ర పోరాటం అంటే నేను సింగిల్ గా ఉండేదుకు పోరాడుతున్నా అని పరోక్షంగా తేజు చెప్పకనే చెప్పాడు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈ మాటల అర్థం అని నెటిజన్లు అంటున్నారు.
మొత్తంగా మెగా ఫ్యామిలిలో నెక్స్ట్ పెళ్లంటూ జరిగితే అది సాయిధరమ్ తేజ్ దే అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోతున్నారు. తేజు తర్వాత అల్లు శిరీష్, వైష్ణవ్ ఉన్నారు.