Asianet News TeluguAsianet News Telugu

#SaiDharamTej: వివాదంలో సాయితేజ్ ‘గాంజా శంకర్‌’‌, పోలీస్ నోటీసులు, వార్నింగ్

 ఈ సినిమాకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (Telangana Anti Narcotics Bureau) పోలీసులు నోటీసులు ఇచ్చారు. అందుకు కారణం ఈ సినిమా టైటిలే.

Sai Dharam Tej, Sampath Nandi film Ganja Shankar lands in trouble jsp
Author
First Published Feb 18, 2024, 4:18 PM IST | Last Updated Feb 18, 2024, 4:18 PM IST

సాయి ధరమ్ తేజ గాంజా శంకర్ మూవీ ఆ మధ్యన లాంచ్ అయ్యిన సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం  మాదక ద్రవ్యాల నేపథ్యంలో నడవనున్నట్లు ఇటీవల సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ తో తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు వివాదంలో పడింది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రత్యేకమైన టీముల్ని ఏర్పాటు చేశారు. గంజాయి తో సహా ఎలాంటి డ్రగ్స్ సరఫరా చేస్తున్నా వదిలి పెట్టడం లేదు. ఈ క్రమంలో గాంజాను ప్రోత్సహించే విధంగా అదేదో హీరోయిజం అన్నట్లుగా చిత్రీకరించడం వివాదాస్పదమైంది.  

 ఈ క్రమంలో  గాంజా శంకర్ టైటిల్ పై నార్కోటిక్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ టైటిల్ ను మార్చాలంటూ చిత్ర యూనిట్ కు నోటీసులు ఇచ్చారు. ఆ మూవీ టీజర్ కూడా విద్యార్థులు, యువతపై ప్రభావం చూపేలా ఉందని ఆగ్రహం వ్యక్త చేస్తూ.. సినిమాలో గంజాయి, డ్రగ్స్ ప్రోత్సహించేలా సీన్స్ ఉంటే తొలగించాలని ఆదేశించారు. సినిమాలో గంజాయికి సంబంధించిన సన్నివేశాలు ఉంటే చట్టం పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు సినిమా నటులు సమాజం పట్ల బాధ్యతో నడుచుకోవాలని.. వారు చేసే పనుల ప్రభావం జనాలపై పడుతుందని.. సినిమాల్లో మాదిరిగా యువత అనుసరించే ప్రమాదం ఉంటుందని నార్కోటిక్ పోలీసులు తెలిపారు. 

ఈ సినిమా పేరులో ఉన్న గాంజా (గంజాయి) అనే ప‌దాన్ని తొల‌గించాల‌ని.. అలాగే సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన సన్నివేశాలుంటే మాత్రం ఎన్డీపీఎస్‌-1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి టైటిల్స్, సినిమాలు.. విద్యార్థులు, యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని.. సినిమాలో గంజాయి సీన్స్‌, దానిపై డైలాగ్స్ లేకుండా చూడాలని.. ఈ ముందస్తు నోటీసులో పేర్కొన్నారు. ఇంతకు ముందు‘బేబి’ (Baby) దర్శకనిర్మాతలకు ఇదే విషయంపై హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ‘గాంజా శంకర్‌’ సినిమా ఆగిపోయిందనే వార్తలు రీసెంట్ గా మీడియాలో  వినిపించాయి. .బడ్జెట్‌ కారణంగా సినిమాని పక్కన పెట్టినట్టు సమాచా
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios