గత ఏడాది బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం తేజు తన 15వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

గత ఏడాది బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం తేజు తన 15వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సాయిధరమ్ తేజ్ చివరగా రిపబ్లిక్ అనే చిత్రంలో నటించాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ప్రస్తుతం తేజు తన తదుపరి చిత్రం కోసం బాగా కష్టపడుతున్నాడు. కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

తాజాగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ విడుదలయింది. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఎన్టీఆర్ తన పవర్ ఫుల్ వాయిస్ తో ఈ చిత్ర కథా నేపథ్యాన్ని అద్భుతంగా వివరించారు. 

'అజ్ఞానం భయానికి మూలం.. భయం మూఢనమ్మకానికి కారణం.. ఆ నమ్మకమే నిజం ఆయనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజ్జాన్ని చూపించే మరో నేత్రమే 'విరూపాక్ష' అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా వాయిస్ అందించాడు. ఈ గ్లింప్స్ లో సాయిధరమ్ తేజ్ ఊరి జనానికి కాగడాతో ఎదురు నిలబడి కనిపిస్తున్నాడు. మొత్తంగా విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం , కన్నడ, హిందీ , మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

YouTube video player