ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న సాయిధరమ్‌ తేజ్‌ ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో వస్తున్నారు. ఆయన కొత్త సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది.

సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదం నుంచి ఆల్మోస్ట్ పూర్తిగా కోలుకున్నారు. రెట్టింపు ఎనర్జీతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. ఆయన ఇటీవల కొత్త సినిమాలను కూడా ప్రారంభించారు. అందులో ఓ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ రాబోతుంది. కార్తీక్‌ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ నెల 7న(బుధవారం) టైటిల్‌ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్ కి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తుండటం విశేషం. గ్లింప్స్ కి మాత్రమే కాదు, సినిమాలో కూడా ఆయన వాయిస్‌ ఓవర్‌ ఉంటుందని సమాచారం. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. గాంభీర్యమైన తారక్‌వాయిస్‌తో ఈ టైటిల్‌ ఫస్ట్ లుక్‌ ఉంటుందని పేర్కొన్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సినిమాకి `విరూపాక్ష` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. `విరూపాక్ష` అంటే శివుడి రూపం అనే అర్థం వస్తుంది. మరి సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ పాత్ర అదే తరహాలో ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా విడుదలైన ప్రీ లుక్‌ ఆకట్టుకుంటుంది. అర్థరాత్రి జనాన్ని చైతన్యం చేసేలా ఆయన పాత్ర ఉంటుందనిపిస్తుంది.

ఇదిలా ఉంటే టైటిల్‌ని బట్టి చూస్తుంటే ఇందులో కాస్త ఆధ్యాత్మిక కోణం యాడ్‌ చేయబోతున్నారా అనే సందేహం కలుగుతుంది. ఇటీవల కాలంలో దేవుడి రిలేటెడ్‌ అంశాలతో రూపొందిన చిత్రాలు ఘన విజయం సాధిస్తున్నాయి. ఇప్పుడు సాయిధరమ్‌ తేజ్‌ అదే ట్రెండ్‌ ఫాలో అవుతున్నారా? అనేది సస్పెన్స్.. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. సాయిధరమ్‌ తేజ్‌కి జోడీగా సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటసి్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్, ఎస్వీసీసీ పతాకాలపై సుకుమార్‌, బివిఎస్‌ఎన్ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.