టాలీవుడ్ మెగా యువ హీరోలందరూ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే మొదట్లో హ్యాట్రిక్ హిట్స్ తో హుషారుగా కనిపించిన సాయి ధరమ్ తేజ్ దరిద్రం ఏమిటో గాని ఇప్పుడు మాత్రం హిట్టు అందుకోవడం లేదు. అందుకే ఓ ట్రిక్ ప్లే చేస్తున్నాడు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇప్పటి నుండి ఈ మెగా మేనల్లుడిని సాయి తేజ్ అని పిలవడం స్టార్ట్ చెయ్యాలట. చిత్ర లహరి సినిమాలో టైటిల్స్ లో ఈ నేమ్ ను యాడ్ చేశారని తెలుస్తోంది. రీసెంట్ గా సినిమాకు సంబందించిన లిరికకల్ సాంగ్ లో కూడా 'ధరమ్' ను డిలీట్ చేశారు. 

కుర్ర హీరో ఇప్పటి నుండి సాయి తేజ్ అని ఓ కొత్త ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. హిట్టు పడటం కోసం పేరులో మార్పులు చేస్తే బెటర్ అని శాస్త్రాల పరంగా ధరమ్ దరిద్రమని తెలుసుకొని.. చేంజ్ చేసి కొత్తగా అడుగులు వేస్తున్నట్లు టాక్. వరుసగా 6 డిజాస్టర్స్ ను ఎదుర్కొన్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు సాయి తేజ్ గా ఎంతవరకు సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.