సాయిధరమ్‌ తేజ్‌ శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ రోజు చేసిన టెస్ట్ లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితి పరిశీలిస్తుందని వెల్లడించారు.  

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ లేటెస్ట్ హెల్త్ అప్డేట్‌ వచ్చింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌ అవసరం తగ్గుతుందన్నారు. క్రమంగా ఆయన కోలుకుంటున్నట్టు తెలిపారు. సాయిధరమ్‌ తేజ్‌ శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ రోజు చేసిన టెస్ట్ లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితి పరిశీలిస్తుందని వెల్లడించారు. 

శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో సాయిధరమ్‌ తేజ్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. మెడికవర్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. 

సాయిధరమ్‌ తేజ్‌ చివరగా గతేడాది `సోలో బ్రతుకే సో బెటర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. కరోనా ఫస్ట్ వేవ్‌ అనంతరం విడుదలైన తొలి చిత్రమిది. ఆ తర్వాత ఆయన నటించిన `రిపబ్లిక్‌` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. రిలీజ్‌కి రెడీగా ఉన్న క్రమంలో ఆయన ప్రమాదానికి గురి కావడం సినిమా రిలీజ్‌పై ఆ ప్రభావం పడిందని చెప్పొచ్చు.