నిహారిక కొణిదెల ‘డెడ్ పిక్సెల్’ ఈవెంట్ గెస్ట్ గా సాయి ధరమ్ తేజ్.. డిటేయిల్స్
నటి, మెగా డాటర్ కొణిదెల నిహారిక ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ సిరీస్ ‘డెడ్ పిక్సెల్’. రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా రెండురోజుల్లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) హీరోయిన్ గా ఆయా చిత్రాల్లో నటించింది. 2016లో ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాగశౌర్య సరసన చక్కగా నటించింది. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యాకాంతం’ వంటి చిత్రాలతో హీరోయిన్ గా అలరించింది. అయితే మూడేండ్లుగా నిహారిక వెండితెరపై మెరవడం లేదు. ఆమె ఫోకస్ మొత్తం వెబ్ సిరీస్ లపైనే పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఓ సిరీస్ లో నటించగా.. గత రెండేండ్లలో వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘హలో వరల్డ్’ వంటి సిరీస్ లనూ నిర్మించింది.
నటిగా తన కేరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్న నిహారిక తాజాగా క్రేజీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిహారిక ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ సిరీస్ ‘డెడ్ పిక్సెల్’ (Dead Pixels). అలెక్సా డేవిస్, విల్ మెరిక్, సార్గోన్ యెల్డా నటించిన హాలీవుడ్ హిట్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’ 2019లో విడుదలైంది. ఈ సిరీస్ నే తెలుగులో రీమేక్ చేశారు. అక్షయ్ పూల్లా స్క్రీన్‌ప్లే అందించగా.. ‘మా వింత గాధ వినుమ’ డైరెక్టర్ ఆదిత్య మండల ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్‌స్టార్ ద్వారా BBC స్టూడియోస్ ఇండియా, Tamada మీడియా సంయుక్తంగా నిర్మించాయి.
డెడ్ ఫిక్స్ తెలుగు సిరీస్ లో నిహారిక కొణిదెల, హర్ష చెముడు, సాయి రోనక్, అక్షయ్ లగుసాని, భావన సాగి ప్రధాన పాత్రల్లో నటించారు. మే 19న స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో మే16న హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో Dead Pixels ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హాజరు కాబోతున్నారు. నటిగా వెబ్ సిరీస్ తో మళ్లీ అలరిచబోతున్న నిహారికకు, టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పబోతున్నారు.
సిరీస్ కింగ్‌డమ్ స్క్రోల్స్ అనే వీడియో గేమ్‌తో నిమగ్నమైన ముగ్గురు స్నేహితుల జీవితాల ఆధారంగా తెరకెక్కబోతోంది. వారి వర్చువల్ జీవితం నిజ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ఆసక్తికరంగా మారింది.