పవన్‌ కళ్యాన్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న `బ్రో` చిత్రం నుంచి ఇప్పటికే పవర్‌స్టార్‌ ఫస్ట్ లుక్‌ వచ్చింది. ఆకట్టుకుంది. తాజాగా సాయిధరమ్‌ తేజ్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇది మరింతగా అలరించేలా ఉంది.

పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి `బ్రో` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి మరో హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఫస్ట్ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో టైమ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో, శివుడి నామస్మరణ జరుగుతుండగా, వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో సాయిధరమ్‌ తేజ్‌ లుక్‌ వాహ్‌ అనేలా ఉంది. 

వైట్‌ టీషర్ట్, వైట్‌ షర్ట్, వైట్‌ ప్యాంట్‌ ధరించి ఉన్న సాయిధరమ్‌ తేజ్‌ లుక్‌ అదిరిపోయింది. ఆయన స్టయిల్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్‌లా ఉందని చెప్పొచ్చు. అయితే ఇందులో కాలానికి సంబంధించిన అంశం, శివుడి ఎలిమెంట్‌ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. దీనికితగ్గట్టుగా వచ్చే బీజీఎం గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ మార్కండేయ(మార్క్) అనే పాత్రలో నటిస్తున్నారు.

Scroll to load tweet…

ఇక తమిళంలో విజయం సాధించిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. మాతృకకి దర్శకత్వం వహించిన సముద్రఖని దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్‌ప్లే, మాటలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ అందిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 28న విడుదల కాబోతుంది. 

ఫస్ట్ టైమ్‌ పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్లు మరింత అంచనాలను పెంచుతున్నాయి. ఈసినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. తన మార్క్ చూపించబోతున్నారు. ఇందులో పవన్‌ దేవుడిగా, సాయితేజ్‌ ఆయన శిష్యుడిగా కనిపిస్తారని తెలుస్తుంది.