మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుసగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నా కూడా అభిమానులను గెలుచుకోవడంలో మాత్రం నిత్యం సక్సెస్ అవుతున్నాడు. చిన్న మామ తరహాలో అభిమానులకు చాలా దగ్గరవ్వడం నేర్చుకున్న ఈ మెగా హీరోకి ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఇకపోతే రీసెంట్ గా చిన్నారులు కూడా ఈ హీరో కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. 

అన్నా అంటూ హలో ఇవ్వడానికి ముందుకు వెళ్లారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ చిత్రలహరి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఏరియాలో సినిమా షూటింగ్ ను నిర్వహించగా సమీపాన ఉన్న స్కూల్ విద్యార్థులు ఈ మెగా మేనల్లుడిని చూసి ఎంతో సంతోషించారు. ముందుగా కొంత మంది అభిమానులను కలుసుకున్న ఈ హీరో ఆ తరువాత పెద్ద సంఖ్యలో చిన్నారులు అక్కడికి చేరుకునే సరికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. 

ఇక వారిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వీడియో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వివరించాడు. ఇక చిత్రలహరి సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానున్న ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సాయి ధరమ్ తేజ్ కష్టపడుతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శిని - నివేత పేతురేజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.