పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నవిషయం తెలిసిందే. అయితే తన రీమేక్ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండగా.. ఆ సినిమా కోసం సాయి ధరమ్ ఏకంగా కొన్ని నెలల డేట్స్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చివరిగా ‘భీమ్లా నాయక్’ చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నేచురల్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం పవన్ మేక్ ఓవర్ షాకింగ్ అనిపిస్తోంది. అలాగే మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తోనూ ‘భవధీయుడు భగత్ సింగ్’ మూవీని లైన్ లో పెట్టాడు. మరో రీమేక్ సినిమా కూడా పవన్ సినీ ఆర్డర్ లో ఉంది.
తమిళంలో భారీ సక్సెస్ ను అందుకున్న ‘వినోదయ సీతమ్’ అనే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడని గతం నుంచే ప్రచారంలో ఉంది. దీనికి ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇదే చిత్రంలో మెగా యంగ్ హీరో, పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
సాయి ధరమ్ తేజ్ పవన్ రీమేక్ సినిమా కోసం భారీ కాల్ షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏకంగా మూడు నెలల పాటు సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చాడని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం 20 రోజుల కాల్ షీట్ ఇచ్చారని తెలుుస్తోంది. ఫాంటసీ యాంగిల్ సాగే ఈ సినిమా కథ అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. తొలిసారిగా పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సాయి ధరమ్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేసేందుకు ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక సాయి ధరమ్ తేజ్ చివరిగా ‘రిపబ్లిక్’తో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతంగా పవన్ రీమేక్ చిత్రంతో పాటు... నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర నిర్మించనున్న మరో సినిమాలోనూ నటిస్తున్నారు.
