Asianet News TeluguAsianet News Telugu

సంపత్ నంది - సాయి ధరమ్ తేజ్ మూవీ అనౌన్స్ మెంట్.. మరో అప్డేట్ కు టైమ్ ఫిక్స్.. అఫీషియల్

సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ మూవీపై అప్డేట్ అందింది. తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అందింది. తేజూ17వ సినిమా సంపత్ నంది డైరెక్షన్ లో చేయబోతుండటం విశేషం. మూవీ డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 
 

Sai Dharam Tej and Sampath Nandi movie Official announcement NSK
Author
First Published Oct 14, 2023, 12:43 PM IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)  తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. చివరిగా ‘విరూపాక్ష’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. అలాగే ‘బో’ చిత్రంతోనూ ప్రేక్షకులను అలరించారు. విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తేజూ తదుపరి చిత్రం అనౌన్స్ మెంట్ అధికారికంగా అందింది. ‘రచ్చ’ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi)  దర్శకత్వంలో తేజూ నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని SDT17  వర్క్ టైటిల్ తో ప్రకటించారు. 

ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫోర్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఎస్ మరియు సాయి సౌజన్య భారీ స్కేల్లో నిరమిస్తున్నారు.అయితే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. మెడపై త్రిశూలం, ఢమరుఖం టాటూను చూపిస్తూ పోస్టర్ విడుదలైంది. మొత్తానికి తేజూ నెక్ట్స్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇదిలా ఉంటే.. ఇవ్వాళ కొద్ది సేపటి కిందనే సినిమాను అనౌన్స్ చేసిన టీమ్.. రేపు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించబోతున్నట్టు తెలిపారు. ఇందుకు టైమ్ కు కూడా ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 8 : 55 గంటలకు First High గా అప్డేట్ రాబోతోందని తెలిపారు. రేపు రిలీజ్ అయ్యే గ్లింప్స్ తో సినిమా గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన డిటేయిల్స్ కూడా అందాల్సి ఉంది. 

మాస్ మిస్సైల్, డైరెక్టర్ సంపత్ నంది నుంచి రెండేళ్లుగా ఎలాంటి సినిమా రాలేదు. కనీసం అప్డేట్ కూడా రాలేదు. చివరిగా ‘సీటీ మార్’తో వచ్చారు. మంచి రిజల్ట్ నే అందుకున్నారు. కాస్తా గ్యాప్ తో ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమాతో రాబోతున్నారు. ఇక ఎలాంటి సబ్జెక్ట్ తో రాబోతున్నారనేది మరింత ఆసక్తిని కలిగిస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios