మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నేడు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆయన ఓ వాట్స్ అప్ చాట్ వీడియో ట్విట్టర్ లో షేర్ చేయడంతో పాటు 'ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి...' అనే సందేశం పోస్ట్ చేశారు. టాలీవుడ్ బ్యాచ్ లర్స్ అందరూ సింగిల్స్ పేరుతో ఒక వాట్స్ అప్ గ్రూప్ మైంటైన్ చేసేవారు. ఇటీవల ఆ గ్రూప్ నుండి ముగ్గురు హీరోలు వెళ్లిపోవడం జరిగింది. 

ముందుగా హీరో నిఖిల్ ఆ తరువాత హీరో నితిన్, ఈనెలలో పెళ్లి చేసుకున్న రానా సింగిల్  లైఫ్ కి, ఆ వాట్స్ అప్ గ్రూప్ కి గుడ్ బై చెప్పేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్ కోసం వినూత్నంగా ఓ ప్రోమోతో వచ్చాడు ధరమ్ తేజ్. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రీకరణ దశలో ఉంది. యూత్ ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే నో పెళ్లి అనే సాంగ్ విడుదల కావడంతో పాటు విశేష ఆదరణ దక్కించుకుంది. 

దర్శకుడు సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా సీనియర్ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రేపు ఉదయం 10:00 గంటలకు ఈ మూవీ నుండి అప్డేట్ రానుంది. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక గత ఏడాది చివర్లో ధరమ్ ప్రతిరోజూ పండగే చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. సాయిధరమ్  కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఆ మూవీ నిర్మాతలకు లాభాలు పంచింది.