అక్కినేని నాగ‌చైత‌న్యకు ఏమాయ చేశావేతో ఫ‌స్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్. ఈ డైరెక్ట‌ర్‌.. చాలా యేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ నాగచైతన్య కాంబినేష‌న్‌లో తెర‌కెక్కించిన సినిమాయే సాహ‌సం శ్వాస‌గా సాగిపో. కొద్ది రోజులుగా స‌రైన హిట్ లేని అక్కినేని బుల్లోడు నాగ‌చైత‌న్య ఎట్ట‌కేల‌కు ప్రేమ‌మ్‌తో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చాడు. దాదాపు యేడాది కాలంగా రిలీజ్‌కు నోచుకోకుండా ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న సాహ‌సం శ్వాస‌గా సాగిపో ఎట్ట‌కేల‌కు అడ్డంకులు దాటి ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా గౌత‌మ్ – చైతు హిట్ కాంబినేష‌న్‌ను రిపీట్ చేస్తూ చైతుకు మ‌రో హిట్ ఇచ్చిందో లేదో సమీక్షిద్దాం.

జోన‌ర్‌: రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, మంజిమా మోహ‌న్‌, బాబా సెహ్‌గ‌ల్‌
సంగీతం: ఏఆర్‌.రెహ్మ‌న్‌
నిర్యాత‌: మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌

కథ:
రజనీకాంత్ మురళీధర్ (నాగచైతన్య).. ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం లేక ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు త‌న చెల్లి కాలేజ్ ఫంక్ష‌న్‌లో లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. మ‌హారాష్ట్ర‌లో ఉండే ఆమె ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌. క‌ట్ చేస్తే అదే అమ్మాయి ఓ కోర్సు కోసం త‌న చెల్లితో క‌లిసి త‌న ఇంట్లోనే దిగుతుంది. కామ‌న్‌గానే ఇద్ద‌రూ ప‌రిచ‌యం పెంచేసుకుంటారు. వీరిద్ద‌రు క‌లిసి బైక్‌మీద వెళుతుండ‌గా ఓ యాక్సిడెంట్ జ‌రుగుతుంది. ఆ టైంలో త‌న బ‌త‌క‌న‌న్న డౌట్‌తో తాను లీలాను ప్రేమిస్తున్న విష‌యాన్ని ఆమెకు చెప్పేస్తాడు ర‌జనీకాంత్‌.

హాస్ప‌టల్లో కోలుకున్న ర‌జ‌నీకి షాకింగ్ విష‌యం తెలుస్తుంది. లీల కుటుంబం ప్ర‌మాదంలో ఉంద‌న్న విష‌యం తెలుసుకున్న ర‌జ‌నీ త‌న ప్రేమికురాలి కోసం మ‌హారాష్ట్ర‌కు వెళ‌తాడు. అయితే అప్ప‌టికే లీలా తల్లిదండ్రుల మీద హత్యా ప్రయత్నం జరగటంలో వాళ్లు హాస్పిటల్ లో ఉంటారు. ర‌జ‌నీ అక్క‌డ‌కు చేరుకున్నాక కూడా ఆమె కుటుంబంపై ఎటాక్స్ ఆగ‌వు. ఈ ఎటాక్స్‌లో ర‌జ‌నీ త‌న ఫ్రెండ్ మ‌హేష్‌ను సైతం కోల్పోతాడు. అస‌లు లీలాను ఎవ‌రు చంపాల‌నుకుంటున్నారు ? ఆమెను చంపేందుకు పోలీసులు సైతం ఎందుకు స‌హ‌క‌రిస్తున్నారు ? అస‌లు ర‌జ‌నీ – లీలా యాక్సిడెంట్ వెన‌క ఉన్న అస‌లు స్టోరీ ఏంటి ? ఈ విష‌యాల‌ను ర‌జ‌నీ ఎలా చేధించాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:
ఈ సినిమా ముందు నుంచి ఊహిస్తున్న‌ట్ట‌గా ప‌క్కా గౌత‌మ్ మీన‌న్ సినిమాలాగా ఉంటుంది. సినిమాలో హీరో, హీరోయిన్ల ల‌వ్ ట్రాక్‌ను ద‌ర్శ‌కుడు చాలా స‌హ‌జంగా డ‌వ‌ల‌ప్ చేశాడు. సినిమా ఫ‌స్టాఫ్ మొత్తం రొమాంటిక్ యాంగిల్లో వెళుతుంది. గౌత‌మ్ రొమాంటిక్ సీన్ల‌ను ఏమాయ చేశావే సినిమాలో డీల్ చేసిన విధానం చూస్తేనే ఆయ‌న ఆ సీన్ల‌లో ఎంత స్పెష‌లిస్టో తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లు చాలా ఫ్రెష్‌గా క‌నిపిస్తాయి.

హీరో-హీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్లు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తాయి. ఇక మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తీర్చిదిద్దిన‌ట్టు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే పాట‌లు, బిట్ సాంగ్స్‌తో పాటు మాంటేజ్ సాంగ్స్‌తో సినిమాలో కాస్త పాట‌లు బోర్ కొట్టించేలా ఉన్నాయి. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే యాక్ష‌న్ + ల‌వ్ సీన్ల‌తో సినిమా స్టోరీ న‌డుస్తుంది. ఎప్పుడైతే యాక్ష‌న్ పార్ట్‌లోకి వ‌చ్చిందో అప్ప‌టి వ‌ర‌కు సినిమాపై ఉన్న ఇంప్రెష‌న్ కాస్త త‌గ్గుతుంది. క‌థ‌, క‌థ‌నాలు దారి త‌ప్పాయి. క‌థ‌తో సంబంధం లేకుండా వ‌చ్చిన క్లైమాక్స్ కూడా సినిమాకు మైన‌స్ అయ్యింది.

న‌టీన‌టులు...
నాగ‌చైత‌న్య మ‌రోసారి రొమాంటిక్ సీన్‌ల‌ను పండించ‌డంతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో కూడా చైతు నుంచి మంచి న‌ట‌న రాబ‌ట్టాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌. ఫస్టాఫ్‌లో సాఫ్ట్‌గా పక్కింటి కుర్రాడిలా కనిపించి, సెకండాఫ్‌లో పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్ళిపోయే పాత్రలో చైతన్య మంచి ప్రతిభ కనబరిచాడు. మంజిమ మోహన్ లుక్స్ పరంగా బాగా ఉంది. నటనపరంగానూ ఆమెకు వంక పెట్టలేం. డీసెంట్ లుక్ లో కనిపిస్తూనే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆకట్టుకుంది. నాగచైతన్య ఫ్రెండ్ మహేష్ గా నటించిన సతీష్ కృష్ణన్, మంచి నటనతో పాటు డ్యాన్సర్ గానూ ప్రూవ్ చేసుకున్నాడు. విలన్ గా బాబా సెహగల్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు.

టెక్నిక‌ల్‌ వర్క్...
మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమా రిలీజ్ కు ముందు చకోరి, వెళ్లిపోమాకే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా స్థాయిని పెంచాడు. ఇక మిగిలిన సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్ర‌ఫీ క్యూట్ ల‌వ్ స్టోరీని ఎంజాయ్ చేసేలా ఉంది. కేర‌ళ లొకేష‌న్‌ల‌లో తీసిన సీన్‌లు చూడ‌డానికి చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

గౌత‌మ్ మీన‌న్...
గౌత‌మ్ మ‌రోసారి త‌న రొమాంటిక్ డైరెక్ట‌ర్ బిరుదును నిలుపుకున్నాడు. సినిమాలో రొమాన్స్‌ను అద్భుతంగా పండించాడు. గతంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్లు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సారి రెండు ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. ఫ‌స్టాఫ్‌లో రొమాన్స్‌, సెకండాఫ్‌లో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో సినిమాను డిజైన్ చేశాడు. ఈ సినిమాకు స్లో న‌రేష‌న్ సినిమాకి బిగ్ మైన‌స్‌. గౌత‌మ్ మీన‌న్ సినిమాల‌లో లాగ్ కామ‌న్ అయిన‌ప్ప‌టికీ, సాహ‌సంలో అది ప‌రిమితిని దాటింది. దీంతో, చాలా చోట్ల బోర్ కొట్టిన‌ట్లు ఫీల‌వుతాడు ప్రేక్ష‌కుడు. సినిమాలో బ‌ల‌మైన ప్ర‌తినాయ‌క పాత్ర కూడా మైన‌స్‌గా మారింది.

ఫ్ల‌స్ పాయింట్స్ :
– నాగ‌చైత‌న్య, మంజిమా మోహ‌న్ రొమాంటిక్ ల‌వ్ సీన్లు
– ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్‌
– ప్రీ క్లైమాక్స్‌
– గౌత‌మ్ మీన‌న్ స్టైలిష్ టేకింగ్‌

మైన‌స్ పాయింట్స్ (-):
– ప్రతిపక్ష నాయకుని పాత్ర
– సా......గదీత

చివరగా… సా.........ఆఆఆఆ....గిపోయిన సాహసం
గౌత‌మ్ మీన‌న్ స్టైల్ రొమాంటిక్ అండ్ యాక్ష‌న్ మూవీస్‌ను బాగా ఇష్ట‌ప‌డే వారికి ఈ సినిమా న‌చ్చుతుంది. అయితే సినిమా అంచ‌నాల‌కు మించి మ‌రి డెడ్ స్లో మోడ్‌లో ఉంటుంది. మ‌ల్టీఫ్లెక్స్ అండ్ ఏ క్లాస్ సెంట‌ర్స్‌కు న‌చ్చే ఈ సినిమా బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో ..?

రేటింగ్ : 2.5