`బలగం` స్ఫూర్తితో మరో సినిమా వస్తోంది. అయితే ఇది రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో వస్తోంది. అదే `సగిలేటి కథ`. రాయలసీమ ఆచారాలను ప్రతిబింబించేలా కోడి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందుతుంది.  

గ్రామీణ నేపథ్య చిత్రాల్లో `బలగం` మూవీ ఓ ట్రెండ్‌ సెట్టర్ గా నిలిచింది. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో, తెలంగాణ పల్లెల్లోనూ ఆచారాలు, కుటుంబ అనుబంధాలు, వారి మధ్య ఉండే భావోద్వేగాలను ప్రధానంగా రూపొందిన `బలగం` మూవీ సంచలన విజయం సాధించింది. దీంతో అలాంటి సినిమాలు వరుసగా రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు `బలగం` స్ఫూర్తితో మరో సినిమా వస్తోంది. అయితే ఇది రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో వస్తోంది. అదే `సగిలేటి కథ`. రాయలసీమ ఆచారాలను ప్రతిబింబించేలా కోడి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందుతుంది. 

తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల అయ్యింది. ఊరి పండగలో మేకలు, కోళ్లు బలివ్వడంతో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది. కోడి అనుబంధంగా సాగే డైలాగులు, సన్నివేశాలు ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. కామెడీగా సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. `బలగం` సినిమాని తలపిస్తుంది. ఈ సినిమాలో రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటించగా, హీరో నవదీప్‌ తన `సీ స్పేస్‌` సమర్పణలో అశోక్‌ ఆర్ట్స్, షేడ్‌ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై దేవీ ప్రసాద్‌ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా సోమవారం ట్రైలర్ రిలీజ్‌ ఫంక్షన్‌ జరిగింది. ఆర్జీవీ విడుదల చేశాడు. నవదీప్‌తోపాటు హీరో సోహైల్‌ పాల్గొన్నారు. 

హీరో సోహెల్ మాట్లాడుతూ.. `ట్రైలర్ చూడగానే నాకు వావ్ అనిపించింది. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ ని ఒకే ఒక్కడు, అన్ని మేజర్ క్రాఫ్ట్ లని హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. ఈ చిత్ర దర్శకుడు ఎంతో ప్రతిభావంతుడు. తప్పకుండ, ఈ సినిమా `బలగం` మూవీ రేంజ్ లో హిట్ అవ్వుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాని ముందుండి నడిపిస్తున్నందుకు సి స్పెస్ నవదీప్ కి నా అభినందనలు` అని తెలిపారు.

సమర్పకుడు నవదీప్ మాట్లాడుతూ.. ఇటీవల ఈ చిత్రాన్ని చూసినప్పుడు తనకు నచ్చిందని, దీన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అతను మల్టిపుల్ క్రాఫ్ట్ లను నిర్వహించడం ముచ్చటేసింది. ఈ చిత్రం అద్భుతమైన ప్రోడక్ట్ అని నన్ను ఓప్పించింది అతనే. అతను చాలా ప్రతిభావంతుడు. కొంతమంది దర్శకులు మాత్రమే మంచి నటనని రాబట్టగలరు. 'సగిలేటి కథ'లో రాజశేఖర్ కొత్త ఆర్టిస్టుల నుండి మంచి కామెడీని రాబట్టారు. చికెన్ ఇక్కడ ఒక రేంజ్ ఎమోషన్స్‌తో ముడిపడి ఉంటుంది. ఈ సినిమా చూసి శాకాహారులు కూడా చికెన్ రుచి చూడాలని టెంప్ట్ అవుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఒక 'చికెన్ చాలా టేస్ట్‌గా చేసిన పాట.. సి స్పేస్‌లో ఉన్న నేను, 'సగిలేటి కథ' లాంటి సినిమాలను సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 'బలగం', 'కేర్‌ ఆఫ్‌ కంచరపాలెం' వంటి చిత్రాలను అంచనాలు లేకుండా చూశాం. 'సగిలేటి కథ' కూడా ఆ చిత్రాలలాగే ఉంటుంది` అని నవదీప్‌ అన్నారు. 

YouTube video player

నిర్మాత దేవిప్రసాద్ బలివాడ మాట్లాడుతూ.. 'సగిలేటి కథ' సినిమాని థియేటర్లలో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా అలాంటి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ ని మీకు ఇస్తుంది. షేడ్ స్టూడియోస్ బ్యానర్ నుంచి హీరో రవితేజను మేల్ లీడ్‌గా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. హీరో సోహెల్ సినిమా ట్రైలర్ చూసి టీమ్ అందరిని అభినందించడానికి వచ్చినందుకు థ్యాంక్యూ. ఈ మధ్య కాలంలో రూట్ లెవెల్ ఉన్న ఫిలిమ్స్ పబ్లిక్ బాగా ఆదరిస్తున్నారు, అలాగే మా చిత్రం కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని చెప్పారు.

దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ, ‘నేను సీమకు చెందినవాడిని, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాకు తెలుసు. ‘సగిలేటి కథ’ అనే నవల నా సినిమాకి ప్రేరణ మాత్రమే. కథ పూర్తిగా ఒరిజినల్‌గా ఉంటుంది. మూలాలు, వ్యామోహంతో మళ్లీ కనెక్ట్ అవ్వడం మా సారాంశం. 'జాతర' వాతావరణం చాలా సాపేక్షంగా ఉంటుంది. నేను RGV గారికి అభిమానిని, వారి మాటలు, ఇంటర్వ్యూలు నాలో నమ్మకాన్ని కలిగిస్తాయి. ఈ సినిమాలో రుచికరమైన కోడిమాంసం తినాలనేది ఒక కీలక పాత్ర లక్ష్యం. అందుకే కోడి కేంద్రంగా ఉంటుంది. కానీ, కథ అంతకు మించినది. సెప్టెంబర్‌లో మూవీ థియేటర్లలో విడుదల కానుంద`ని చెప్పారు.

నటీనటులు : రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని.
రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : రాజశేఖర్ సుడ్మూన్.
నిర్మాతలు : అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడ.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నరేష్ మాదినేని.
అసోసియేట్ ప్రొడ్యూసర్ : పుష్పాభాస్కర్, సునీల్ కుమార్ ఆనందన్, లీలా కృష్ణ కొండేపాటి.
లైన్ ప్రొడ్యూసర్ : చందు కొత్తగుండ్ల.
సంగీతం : జశ్వంత్ పసుపులేటి.
నేపథ్యసంగీతం : సనల్ వాసుదేవ్.
సాహిత్యం : వరికుప్పల యాదగిరి, పవన్ కుందాని, రాజశేఖర్ సుడ్మూన్, శశికాంత్ బిల్లపాటి, జశ్వంత్ పసుపులేటి.
ఆర్ట్ డైరెక్టర్స్ : హేమంత్ జి, ఐశ్వర్య కులకర్ణి.
కాస్ట్యూమ్ డిజైనర్ : హర్షాంజలి శేనికేషి.
పి.ఆర్.ఓ : తిరుమలశెట్టి, వెంకటేష్
సౌండ్ డిజైనర్ : యతి రాజు.
సౌండ్ మిక్సింగ్ : శ్యామల సిక్దర్.
డి.ఐ : కొందూరు దీపక్ రాజు.
పబ్లిసిటీ డిజైనర్: యమ్.కే.యస్ మనోజ్