సద్గురు నటించిన “దిస్ ఈజ్ మీ నౌ: ఏ లవ్ స్టోరీ” మూవీ ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఆయన గెస్ట్ రోల్ ప్లే చేశారు.

మన నటులు హాలీవుడ్ చిత్రాల్లో ఎంట్రీ ఇస్తూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదేమీ కొత్త విషయం కాదు..వింత విషయం కాదు. అయితే ఈ లిస్టులోకి ప్రముఖ ఆద్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్ చేరటం మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరమైన అంశమే. ఈషా ఫౌండేషన్ అధినేత, జగ్గీ వాసుదేవ్ ఓ హాలీవుడ్ సినిమాలో నటించిన విషయం ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. అది కూడా జెన్నీఫర్ లోపెజ్ చిత్రం కావడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ఈషా ఫౌండేషన్ అధినేత, జగ్గీ వాసుదేవ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించటంతో ఆ క్రేజ్ మరింత రెట్టింపు కాబోతోందని చెప్తున్నారు. ఎందుకంటే సద్గురు ఇప్పుడు హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వటమే కారణం. ఆయన నటించిన హాలీవుడ్ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సద్గురు నటించిన “దిస్ ఈజ్ మీ నౌ: ఏ లవ్ స్టోరీ” మూవీ ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఆయన గెస్ట్ రోల్ ప్లే చేశారు.

చిత్ర విశేషాల్లోకి వెళితే ...ఈ సినిమాలో జెన్నీఫర్ లోపెజ్ కీ రోల్ ప్లే చేసింది. డేవ్ మేయర్స్ డైరక్ట్ చేసిన ఈ మూవీలో బెన్ అఫ్లెక్స్, సోఫియా వెర్గారా, కేకే పాల్మెర్, ట్రెవర్ నోహ్, పోస్ట్ మలోన్, నీల్ డి గ్రాస్సే టైసన్ వంటి స్టార్స్ కనిపిస్తారు. జగ్గీ వాసుదేవ్ కూడా ఈ మూవీలో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆయన నటించిన ఒక సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన దేశంలోనే కాకుండా మరికొన్ని దేశాల్లో ఈ దిస్ ఈజ్ మీ నౌ: ఏ లవ్ స్టోరీ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.