తాగేసి ఉన్న అతడిని చూసి భయపడిపోయిందట!

First Published 30, Jun 2018, 10:43 AM IST
sad incident to mehreen in train journey
Highlights

రైలులో మెహ్రీన్ కు చేదు అనుభవం

సినిమా తారలు షూటింగ్ ల కోసం ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఎక్కువగా ఫ్లైట్ లలోనే జర్నీలు చేస్తుంటారు. కానీ ఒక్కోసారి ట్రైన్ లో కూడా ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంటుంది. టాలీవుడ్ హీరో మెహ్రీన్ కూడా ట్రైన్ లో ప్రయాణించాల్సి వచ్చింది.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'నోటా' అనే సినిమాలో మెహ్రీన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై వెళ్లాలి. ఫ్లైట్ టికెట్ దొరకకపోవడంతో నిర్మాత మెహ్రీన్ ను ట్రైన్ లో రమ్మని రిక్వెస్ట్ చేశారు. అలా ప్రయాణానికి సిద్ధమైన మెహ్రీన్ ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. నిర్మాతలు ఆమె కోసం బుక్ చేసిన బెర్త్ ను మరో వ్యక్తి ఆక్రమించుకున్నాడు.

పైగా అతడు పూర్తిగా మద్యం సేవించి ఉండడంతో అతడిని చూసి మెహ్రీన్ భయపడిపోయిందట. చాలా సమయం పాటు అలా నిలబడే ప్రయాణం చేసిందట. ఆ తరువాత నిర్మాతకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పడంతో ఆయన తన మనుషులను కార్ లో పంపించి మెహ్రీన్ ను చెన్నై తీసుకువెళ్లారట. ఈ విషయాన్ని నోటా చిత్రబృందం వెల్లడించింది.  

loader