హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆగస్ట్ 15న రిలీజ్ డేట్ అని యువీ క్రియేషన్స్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్ర యూనిట్ లో హై టెన్షన్ నెలకొంది. అంతకుముందు వరకు సాఫీగా నెమ్మదిగా జరిగిన పనులు ఒక్కసారిగా రిలీజ్ డేట్ ప్రకటించడంతో వేగాన్ని అందుకున్నాయి.. 

అయితే అంతా అనుకున్నట్టే జరుగుతుంది అనుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు విఎఫ్ఎక్స్ పనులు టెన్షన్ పెడుతున్నాయట. ఫైనల్ ఎడిట్ లో విఎఫ్ఎక్స్ ను  మిక్స్ చేయాలి. అనంతరం ఫైనల్ కాపీని సెన్సార్ కు పంపాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు విఎఫ్ఎక్స్ పనులు చేస్తోన్న కంపెనీ ఇంకా తుది దశకు చేరుకోలేదని తెలుస్తోంది. 

ఇంకా చాలా పని మిగిలి ఉందట. దీంతో చిత్ర యూనిట్ తీరిక లేకుండా స్టూడియోల చుట్టూ తిరుగుతూ పని స్పీడ్ గా అయ్యేలా పుష్ చేస్తున్నారట. ఇప్పటికే టీమ్ రెగ్యులర్ ప్రమోషన్స్ ను సరిగ్గా స్టార్ట్ చేయ లేదు. 300కోట్ల సినిమా అంటే వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో సినిమాను వీలైనంత త్వరగ్గా పూర్తి చేయాలనీ సాహో టీమ్ పరుగులు పెడుతోంది.