దుబయిలో సాహో చేజింగ్ సీన్

saaho shooting shifting to dubai soon
Highlights

  • యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హిరోగా తెరకెక్కుతున్న సాహో
  • భారీ బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్
  • త్వరలో దుబయి బుర్జ్ ఖలీఫా వద్ద 20నిమిషాల ఛేజింగ్ సీన్ షూట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్ సాహో షూటింగ్ త్వరలోనే దుబాయ్‌కి షిఫ్ట్ కానుంది. దుబాయ్‌లోని ఫేమస్ బుర్జు ఖలీఫా టవర్స్, రస్-అల్-ఖైమా, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇత్తేహాద్ టవర్ పరిసర ప్రాంతాల వద్ద జరిగే ఈ షెడ్యూల్లో దాదాపు 20 నిమిషాల నిడివిగల యాక్షన్ సీక్వెల్‌ని తెరకెక్కించేందుకు సాహో మేకర్స్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సీక్వెల్ షూటింగ్ కోసం త్వరలోనే సాహో టీమ్ దుబాయ్‌కి వెళ్లనుంది.హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో ఈ యాక్షన్ సీక్వెల్స్‌ని తెరకెక్కించనున్నారు. ఈ షూట్ కోసం ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్, లగ్జరీ ఎస్‌యూవీ కార్లు, భారీ ట్రక్కులు వినియోగించనున్నారు సాహో మేకర్స్. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. 'బాహుబలి'తో ప్రభాస్ దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకోవడంతో ఇప్పుడు అతడు హీరోగా సెట్స్‌పై వున్న సాహో సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ సైతం ఎదురుచూస్తున్నారు.

loader