టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో సాహో ఒకటి. బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో నార్త్ సినీ లవర్స్ కూడా సినిమా రిలీజ్ డేట్ పై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని ఫాలో అవుతున్నారు. ఇకపోతే ఇటీవల శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్బంగా ఒక క్లిప్ ను వదిలిన చిత్ర యూనిట్ సినిమా ఆగస్ట్ లోనే రానుందని చెప్పారు. 

ఇక సైరా కూడా అదే సమయంలో రానుందని టాక్ రావడంతో సినిమా రిలీజ్ డేట్ పై పలు ఊహాగానాలు అనేక రూమర్స్ కి తావిచ్చాయి. చిత్ర యూనిట్ కూడా సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే రూమర్స్ పై స్పందించకపోవడంతో కొత్త అనుమానాలకు దారి తీసింది. అయితే సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్న అరుణ్ విజయ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. 

ఇటీవల తనకు సంబందించిన సాహో షూటింగ్ వర్క్ అయిపోయిందని ఆగష్టు 15న థియేటర్స్ లో కలుసుకుందాం అని సాహో గురించి ట్వీట్ చేశారు. అంటే సినిమా రిలీజ్ అదే తేదికి రానుందని అందరికి ఓ క్లారిటీ వచ్చింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళ్ - హిందీలో కూడా భారీగా రిలీజ్ కాబోతోంది.  

saaho