బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కి అన్ని భాషల్లో అభిమానులు పెరిగారు. ముఖ్యంగా కోలీవుడ్ లో అభిమానం డోస్ గట్టిగానే  పెరిగింది. అయితే సాహో సినిమాకు ఆ క్రేజ్ మరింత కలిసొచ్చేలా ఉంది. తమిళనాడులో ప్రభాస్ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని యూవీ క్రియేషన్స్ ఇప్పటికే స్పెషల్ ప్లాన్ రెడీ చేసుకుంది. 

ఆగస్ట్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కారణంగా సూర్య బందోబస్త్ వాయిదా పడింది. లోకల్ హీరో అయినా సూర్యకి ఈ మధ్య హిట్స్ లేవు. కెవి.ఆనంద్ డైరెక్షన్ లో చేసిన బందోబస్త్ సినిమాపై అంచనాలైతే బాగానే ఉన్నాయి. పైగా మోహన్ లాల్ - ఆర్య వంటి స్టార్స్ నటిస్తుండడంతో మల్టీస్టారర్ అంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. 

అసలైతే ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ సాహో లాంటి పెద్ద సినిమాతో పోటీ ఎందుకని 30వ తేదిని సెట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు సాహో అదే తేదికి వాయిదా పడటంతో సూర్య చేసేదేమి లేక కొత్త డేట్ కి షిఫ్ట్ అవుతున్నాడు. సెప్టెంబర్ మిడ్ లో బందోబస్త్ ని రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నాడట. కోలీవుడ్ సమాచారం ప్రకారం ప్రభాస్ సినిమాకు మంచి డిమాండ్ ఉండడంతో సూర్య బాక్స్ ఆఫీస్ ఫైట్ కి దైర్యం చేయలేకపోతున్నట్లు టాక్.