సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ప్రభాస్ సాహో సినిమా ఆగస్ట్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచేస్తోంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

గత వారం నుంచి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నెల 18, 24వ తేదీల్లో ఎదో ఒక డేట్ ని ఫైనల్ చేయాలనీ యూవీ క్రియేషన్స్ ఆలోచించింది. ఫైనల్ గా 18 బెస్ట్ డేట్ అని రామోజీ ఫిల్మ్ సిటీలో వేడుకను గ్రాండ్ గా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

ఈ విషయంపై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి స్పెషల్ ఎనౌన్సమెంట్ వెలువడనుంది. ఇక ఆగస్ట్ 15న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాహో గేమ్ ను రిలీజ్ చేయనున్నారు. మంగళవారం విడుదలైన గేమ్ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.