ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టడానికి సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ తో స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా యూవీ క్రియేషన్స్ మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించినట్లు ఇటీవల ప్రభాస్ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చాడు.

అయితే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 125కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇదొక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటె బాహుబలి 125కోట్ల రైట్స్ తో మాత్రమే సరిపెట్టుకుంది. ఏరియాల వారీగా చూస్తే ప్రభాస్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈస్ట్ - వెస్ట్ రెండు ఏరియాలకు కలిపి 19కోట్ల ధర పలుకగా కోస్తా ఆంధ్ర లో మొత్తంగా 60కోట్లకు సినిమా అమ్ముడైనట్లు సమాచారం. 

ఇక సీడెడ్ లో ఇద్దరు బయ్యర్లు కలిసి 5 జిల్లాలకు గాను 25కోట్లకు కొనుగోలు చేశారు. మెయిన్ నైజం ఏరియాను సినిమా నిర్మాణసంస్థ యువీ క్రియేషన్స్ రిలీజ్ చేసుకుంటోంది. నైజం ధర 40కోట్లవరకు ఉన్నట్లు సమాచారం. మరి ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోన్న ప్రభాస్ సాహో తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో లాభాల్ని అందిస్తుందో చూడాలి.  సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 30న తెలుగు తమిళ్ హిందీ మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది.