Asianet News TeluguAsianet News Telugu

బ్లేమ్ గేమ్: సాహో..డిజాస్టర్, ఎవరిది తప్పు ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిన బాహుబలి తర్వాత ఎంత గా పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో బాలీవుడ్ తో సహా అన్నీ భాషల్లో ప్రభాస్ క్రేజ్ ఓ రేంజిలో క్రియేట్ అయ్యింది. 

Saaho output-Who is to be blamed?
Author
Hyderabad, First Published Aug 31, 2019, 12:16 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిన బాహుబలి తర్వాత ఎంత గా పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో బాలీవుడ్ తో సహా అన్నీ భాషల్లో ప్రభాస్ క్రేజ్ ఓ రేంజిలో క్రియేట్ అయ్యింది. దాంతో ఖచ్చితంంగా ఆయన తదుపరి చిత్రంపై అంచనాలు  పెరుగుతాయి.  ఈ నేపధ్యంలో రన్ రాజా రన్ వంటి సినిమాని డైరక్ట్ చేసిన  సుజిత్ రెడ్డి ప్రభాస్ కోసం ఒక  కథని సిద్ధం చేసి రెండేళ్ళు ఎదురు చూసి మరో  రెండేళ్ళు సినిమాని తీశాడు. బాహుబలి కన్‌ క్లూజన్ హంగామా పూర్తవగానే సాహో టీజర్ తో ' ఇట్స్ షో టైం ' అని సాహో సందడి మొదలు పెట్టారు.  అయితే ఈ సినిమా ప్రభాస్ ని మొత్తంగా ముంచేసింది. డిస్ట్రిబ్యూటర్స్ కి, బయ్యర్స్ కి ఇప్పుడు హార్ట్ ఎటాక్ తెప్పించే స్దితిలో డిజాస్టర్ అయ్యింది.

ఈ నేపధ్యంలో ఇప్పుడీ డిజాస్టర్ ఫలితం రావటానికి ఎవరు కారణం అనే చర్చ మొదలైంది. చాలా మంది ఈ సినిమాని ఇంత దారుణమైన స్క్రీన్ ప్లే తో చెప్పిన సుజీత్ దే తప్పు అని తేలుస్తున్నారు. అయితే అతనేమీ కథ ఎవరికీ చెప్పకుండా తెరకెక్కించలేదు కదా,ముందు ప్రభాస్ కు కథ చెప్పి ఒప్పుకున్నాకే సినిమాని ముందుకు తీసుకువెళ్లాడు కదా..ప్రభాస్ ముందే గెస్ చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా అంటున్నారు.

అలాగే ప్రభాస్ సొంత ప్రొడక్షన్ లాంటి యువి క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా కావటంతో  హీరోని కంట్రోలు చేయటం డైరక్టర్ కు కష్టమైందా అనే సందేహాలు సైతం వినపడుతున్నాయి. ఎందుకంటే సినిమాలో ఎక్కడా హీరో కు జోష్ అనేది లేదు. చాలా డల్ గా బద్దకంగా కదులుతూంటాడు. ఉషారు లేకుండా సీన్స్ నడుస్తూంటాయి. అదే వేరే ప్రొడక్షన్ అయితే ఖచ్చితంగా హీరో చేతే  తనకు కావాల్సిన అవట్ ఫుట్ వచ్చేదాకా చేయించేవారంటున్నారు. దీన్ని బట్టి కథ ఓకే చేసినందుకు హీరోని, అలాంటి సినిమా చేసినందుకు దర్శకుడు సుజీత్ ది తప్పే అవుతుంది. ఏమంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios