బాహుబలి అనంతరం అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించబడిన తెలుగు సినిమా సాహో సౌత్ లో దారుణమైన రిజల్ట్ ని అందుకుంది. బాహుబలి క్రేజ్ తో నార్త్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన ప్రభాస్ అదే తరహాలో హిందీలో సాహో తో సక్సెస్ అందుకున్నాడు. 125కోట్లకు పైగా కలెక్షన్స్ బాలీవుడ్ స్టార్స్ ని సైతం ఆశ్చర్యపరిచింది.  

తెలుగు రాష్ట్రాల్లో అలాగే తమిళనాడు - కేరళలో దారుణమైన నష్టాలను మిగిల్చినసాహో మొదట ఈ ఏరియాల్లోనే ఎక్కువ లాభాలను అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా స్క్రీన్ ప్లే అంచనాలను తాకడంలో మిస్ ఫైర్ అయ్యింది. సౌత్ లో టాక్ సంగతి పక్కనపెడితే నార్త్ జనాలు మాత్రం సినిమాను ఎగబడి చూడటం ఆశ్చర్యమనే చెప్పాలి.ముఖ్యంగా ఒరిస్సా - బీహార్ స్టేట్స్ లలో సినిమా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

బీహార్ లో అయితే టాప్ హిందీ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను కూడా బ్రేక్ చేసింది. కొన్ని ఏరియాల్లో సల్మాన్ ఖాన్ - అమీర్ ఖాన్ చిత్రాల అనంతరం అత్యధిక షేర్స్ అందించిన చిత్రాల జాబితాలో ప్రభాస్ సైరా సినిమా నిలిచినట్లు తెలుస్తోంది. మరి ఈ విజయంతో ప్రభాస్ నార్త్ జనాలకు నెక్స్ట్ ఎలాంటి సినిమాను అందిస్తాడో చూడాలి.