సాహో సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో అభిమానులకు ఇప్పటికె ఒక క్లారిటీ వచ్చేసుంటుంది. యాక్షన్ డోస్ హాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో సినిమా తప్పకుండా అన్ని భాషల్లో సక్సెస్ అవుతుందనే టాక్ మొదలైంది. 

టీజర్ తో ప్రభాస్ మరో సరికొత్త రికార్డును అందుకున్నాడు. సాహో టీజర్ విడుదలైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్ల డిజిటల్ వ్యూవ్స్ ని అందుకుంది. తెలుగు - హిందీలో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ - మలయాళ భాషల్లో అనువాదమవుతోంది. 

సౌత్ లో బాహుబలి తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో సినిమాను విడుదల చేయాలనీ యూవీ క్రియేషన్స్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ బిజినెస్ కూడా ముగిసింది. 43కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వం వహించిన సాహో ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉంది. ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.