యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. బహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సాహో కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ రాని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాహో చిత్రాన్ని దర్శకుడు సుజీత్ తెరకెక్కించాడు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ప్రచారం జరుగుతోంది. ఆగష్టు 30న సాహో విడుదల కాబోతోంది. అంతకంటే ముందుగానే ప్రభాస్ ఈ చిత్రాన్ని అనుష్కకు చూపించబోతున్నాడట. అందుకోసం స్పెషల్ స్క్రీనింగ్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ పలు ఆంగ్ల మీడియాలో కూడా ఈ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. బాహుబలి చిత్రంతో ప్రభాస్, అనుష్క మంచి స్నేహితులుగా మారాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు కూడా అనేక రూమర్లు వినిపించాయి. అయితే అనుష్క, ప్రభాస్ ఇద్దరూ ఆ వార్తలని ఖండించారు. యువీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ని ఆగష్టు 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.