Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకి సమాధానం!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆయన నటిస్తోన్న సినిమాలను భారీ స్కేల్ లో విడుదల చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

saaho movie making video on prabhas birthday
Author
Hyderabad, First Published Oct 16, 2018, 3:36 PM IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆయన నటిస్తోన్న సినిమాలను భారీ స్కేల్ లో విడుదల చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కి అభిమానులతో షేర్ చేసుకోవడం లేదు.

దీంతో ప్రభాస్ స్టిల్స్ ఏమైనా రిలీజ్ చేయమని, సినిమా గురించి ఏదొక అప్డేట్ ఇవ్వండంటూ ఆయన అభిమానులు ట్విట్టర్ వేదికగా నిర్మాతలు అడుగుతున్నారు. ఇప్పుడు వారి ఎదురుచూపులకు సమాధానం ఇవ్వబోతుంది చిత్రబృందం. ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ ని దుబాయ్ లో కోట్లు ఖర్చు పెట్టి తీశారు.

ఇప్పుడు ఆ యాక్షన్ సీన్ కి సంబంధించిన మేకింగ్ వీడియోని ప్రభాస్ పుట్టినరోజు ఈ నెల 23న విడుదల చేయనున్నారు. ఇప్పటికే మేకింగ్ వీడియో కటింగ్ పూర్తయిందట. నేపధ్య సంగీతం యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేకింగ్ వీడియో సినిమాపై హైప్ మరింత క్రియేట్ చేస్తుందని అంటున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios