ఆగస్ట్ 30న విడుదలైన 'సాహో' సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్స్ పై మాత్రం పెద్దగా ఎఫెక్ట్ పడడం లేదు.  ఓవరాల్‌గా సినిమా మొదటి మూడు రోజులకు గాను రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇందులో ఓవర్సీస్ కలెక్షన్ 8 మిలియన్ డాలర్లు అని సమాచారం.

'సాహో'కి నాలుగో రోజు కూడా మంచి కలెక్షన్సే వచ్చాయి. వినాయక చవితి సెలవు కూడా 'సాహో'కి సానుకూలంగా మారింది. నాలుగు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 'సాహో' షేర్ 67 కోట్ల 35 లక్షల రూపాయలకు చేరింది. నిజానికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.188 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. 

మరి మిగిలిన రన్ తో అన్ని వసూళ్లు రాబట్టడం అంటే అంత  సులువైన విషయం కాదు.. ఈరోజు నుండి సినిమాకి వచ్చే కలెక్షన్స్ మీద సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మరోవైపు బాలీవుడ్ లో నాలుగో రోజు సినిమా కలెక్షన్స్ తగ్గినట్లు తెలుస్తోంది. సోమవారం బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద రూ. 14.20 కోట్ల గ్రాస్ వసూలైనట్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

'సాహో' హిందీ వర్షన్ ఓపెనింగ్ డే అంటే శుక్రవారం రూ.24.40 కోట్ల గ్రాస్ రాబట్టింది. శనివారం రూ.25.20 కోట్లు, ఆదివారం రూ.29.48 కోట్లు వసూలు చేసింది. కానీ సోమవారం మాత్రం వసూళ్లు తగ్గిపోయాయి. మొత్తంగా హిందీ వర్షన్ నాలుగు రోజుల్లో రూ. 93.28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.