Asianet News TeluguAsianet News Telugu

రెండు నెలలు తిరక్కుండానే తల్లైన ప్రభాస్ హీరోయిన్.. షాక్ లో అభిమానులు!

2021 మే 15న తుషాన్, ఎవ్లీన్ వివాహం ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగింది. వివాహం అనంతరం సినిమాలు తగ్గించిన ఎవ్లీన్ భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో కాపురం ఉంటున్నారు. ఇక పెళ్ళై రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే ఎవ్లీన్ గర్భం దాల్చడం విశేషత సంతరించుకుంది.

saaho fame evelyn sharma conceive fans congrats over social media ksr
Author
Hyderabad, First Published Jul 11, 2021, 4:27 PM IST

 
హీరోయిన్ ఎవ్లీన్ శర్మ తాను గర్భవతి అంటూ అధికారిక ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన డెంటిస్ట్ డాక్టర్ తుషాన్ బిందిని వివాహం చేసుకున్న ఎవ్లీన్ పెళ్ళైన చాల తక్కువకాలంలోనే గర్భం దాల్చారు. డాక్టర్ తుషాన్ బిందితో చాలా కాలంగా ఎవ్లీన్ శర్మ ప్రేమాయణం నడుపుతున్నారు. 2019లో ఈ జంట నిశితార్థం జరుపుకున్నారు. 


2021 మే 15న తుషాన్, ఎవ్లీన్ వివాహం ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగింది. వివాహం అనంతరం సినిమాలు తగ్గించిన ఎవ్లీన్ భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో కాపురం ఉంటున్నారు. ఇక పెళ్ళై రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే ఎవ్లీన్ గర్భం దాల్చడం విశేషత సంతరించుకుంది.  ఈ శుభవార్త తమకు ఎనలేని సంతోషం పంచినట్లు ఎవ్లీన్ తెలియజేశారు. ఆస్ట్రేలియాలో ఎవ్లీన్ బిడ్డకు జన్మను ఇవ్వనుంది. 


పలు హిందీ చిత్రాలలో నటించిన ఎవ్లీన్ శర్మ సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సాహో పాన్ ఇండియా మూవీగా విడుదల కాగా, ఎవ్లీన్ పోలీస్ అధికారిణి రోల్ చేస్తారు. ఎవ్లీన్ గర్భం దాల్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు, శ్రేయోభిలాషులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios