ఆగస్ట్ నెల నుంచి సినీ ప్రేక్షకులకు అసలైన మాజానిచ్చే సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసి మంచి కలెక్షన్స్ అందుకోవాలనే తొందరలో రెండు సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతున్నాయి. ఈ రిస్క్ చిన్నదే అయినా ఎంతో కొంత నష్టపోయేది ఎవరంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 

ప్రభాస్ యాక్షన్ సినిమా సాహో కోసం నేషనల్ వైడ్ గా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు జనాల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాంటి సినిమాతో పోటీకి సిద్దమయ్యాడు నాగ్. రొమాంటికి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మన్మథుడు 2 ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతోంది. 

సాహో 15న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అంటే కేవలం 6 రోజుల తేడాతో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంటే మన్మథుడు 2 ఏమైనా ముందే రాబట్టాలి. సాహోకు ఎలాంటి టాక్ వచ్చినా వారం వరకు హవా తగ్గదు. కాబట్టి మన్మథుడు 2 వీలైనంత త్వరగా కలెక్షన్స్ ని రికవర్ చేయాలి. 

చాలా వరకు జనాలు సాహో రిలీజ్ కు ఆశపడి మన్మథుడు2 ను పట్టించుకోకేపోతే కూడా కష్టమే. అందుకే ప్రమోషన్ డోస్ కూడా తప్పనిసరిగా పెంచాలి. సాహో నాలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది గనక మినిమమ్ థియేటర్స్ ని లాక్కోగలదు.ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. సో మన్మథుడు 2 టార్గెట్ మొదటి ఆరు రోజులు. మరి ఈ సమయంలో సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.