బాలీవుడ్ లో 'ధూమ్' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాలో జాన్ అబ్రహాం దొంగగా కనిపించగా.. రెండో భాగంలో హృతిక్ దొంగగా కనిపించింది మెప్పించాడు. మూడో భాగంలో అమీర్ ఖాన్ నటించాడు. మూడో భాగం కంటే మొదటి రెండు భాగాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి.

ఇప్పుడు ఈ సిరీస్ లో నాలుగో భాగాన్ని ఘనంగా తీయాలని ప్రయత్నిస్తున్నారు. అభిషేక్ బచ్చన్,ఉదయ్ చోప్రాల పాత్రలను యంగ్ హీరోలతో రీప్లేస్ చేసి సినిమాను తీయాలని యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రయత్నాల్లో ఉంది. అయితే 'సాహో'ట్రైలర్ చూసిన తరువాత ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలను మానుకున్నట్లు తెలుస్తోంది.

'సాహో' సినిమా విజువల్స్ చూసిన వారంతా సినిమాను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. విజువల్ గా ఈ సినిమా మరో లెవెల్ గా వెళ్లనుందని అంటున్నారు. యాక్షన్ స్టంట్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకే ప్రస్తుతానికి 'ధూమ్' సినిమాను పక్కన పెట్టి 'సాహో' బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ని బట్టి ఇంతలో తీయాలి..? ఎలా తీయాలనే..? విషయాల్లో ఓ నిర్ణయానికి రానున్నారు.

మొత్తానికి 'సాహో' సినిమా దాడికి సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవడమే కాదూ.. ఏకంగా సినిమాలను కూడా ఆపేస్తున్నారు. అది కూడా బాలీవుడ్ లో కావడంతో తెలుగు సినిమా స్థాయి ఎంతగా పెరిగిందో అంచనా వేసుకోవచ్చు!