బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ గతంలో ఫర్హాన్ అక్తర్ తో డేటింగ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆ తరువాత ఈ జంట విడిపోయింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతోన్న శ్రద్ధా పెళ్లిపీటలు ఎక్కబోతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. 

2020లో శ్రద్ధా వివాహం చేసుకోబోతుందని టాక్. కొంతకాలంగా ఈ బ్యూటీ రోహన్ శ్రేష్ట అనే ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేస్తుందట. చాలా కాలంగా వీరిద్దరికీ ఒకరితో ఒకరికి పరిచయం ఉందట. దీంతో ఇప్పుడు అతడిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని భావిస్తోందట.

ప్రస్తుతం శ్రద్ధ వయసు 32. దీంతో ఇంట్లో వారు కూడా ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతపెడుతున్నారట. అందుకే ఇంట్లో వారికి రోహన్ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించిందట శ్రద్ధా.

అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020లో ఈ జంట వివాహం చేసుకోనున్నారు. ప్రస్తుతం శ్రద్ధా తెలుగులో 'సాహో' సినిమాలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో 'చిచ్చోరే', 'ఏబీసీడీ 3' చిత్రాల్లో నటిస్తోంది.