హైదరాబాద్: ఆర్ఎక్స్100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి పేరు మీద ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అజయ్ భూపతి హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఓ వ్యక్తి తన పేరు మీద వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో తప్పుడు ప్రకటనలు ఇచ్చాడని, ఆ ప్రకటనలు తాను చేయలేదని అజయ్ భూపతి చెప్పారు. తాను తీసే కొత్త సినిమాలో అవకాశాలు కల్పిస్తానని ప్రకటనలు ఇచ్చి ఆ వ్యక్తి అమ్మాయిలకు తన పేరు మీద వల వేస్తున్నాడని అజయ్ భూపతి ఫిర్ాయదు చేశారు. 

తన పేరు మీద సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఓ వ్యక్తి హల్ చల్ చేస్తున్న విషయాన్ని అజయ్ భూపతి పోలీసుల దృష్టికి తెచ్చారు. రామ్‌ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్‌ భూపతి, ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ బోల్డ్ మూవీ సంచలన విజయం సాదించటంతో అజయ్‌ ఇమేజ్‌ ఓ రేంజ్‌కు వెళ్లింది. ఆర్ ఎక్స్‌ 100 ఘన విజయం సాదించినా అజయ్‌ మరో సినిమాను ఇంతవరకు ప్రారంభించలేదు.