అతి తక్కువ  బడ్జెట్ తో పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు  అజయ్ భూపతి. ఆయన డైరక్ట్ చేసిన ఆరెక్స్ 100 గత ఏడాది  ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో  చూసాం. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి కానీ వాటిలో ముందుకు వెళ్లినవి తక్కువ. చాలా మంది హీరోలు ఈ డైరక్టర్ తో సినిమా చేద్దామనకున్నారు. కానీ వారిని  కన్వీన్స్ చేయలేకపోయాడు. కారణం ఏదైనా రామ్, నితిన్ వంటి హీరోలు సైతం నో చెప్పేసారు. 

చివరకి అజయ్ భూపతి ఫైనల్ గా బెల్లం హీరోతో లాక్ అయిపోయాడు. సాయి శ్రీనివాస్ తన పుట్టిన రోజు సందర్భంగా రమేష్ వర్మ సినిమాతో పాటు ఇది కూడా అనౌన్స్ చేసేసారు. నిజానికి అజయ్ భూపతి ఓ సీనియర్ స్టార్ హీరోతో చేస్తాడనే వార్తలు గట్టిగానే ప్రచారంలోకి వచ్చిన నేపధ్యంలో బెల్లంకొండతో సినిమా చేయటం చాలా మందిని ఆశ్చర్య పరిచింది.  అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది.

బెల్లంకొండ శ్రీనివాస్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ తో మహాసముద్రం టైటిల్ తో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా ఆగిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.  అయితే ఈ విషయమై అఫీషియల్ న్యూస్ లేదు. మరి అజయ్ భూపతి నెక్ట్స్ ఏ హీరోతో ముందుకు వెళ్తాడనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.