అప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అజయ్ భూపతి 'RX100' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా అతడికి మంచి విజయన్ని దక్కించుకోవడంతో పాటు పలు సినిమా ఆఫర్లు రావడానికి కారణమైంది. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీసి విజయం అందుకున్న అజయ్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

పెద్ద బ్యానర్లు లైన్ లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఏ సినిమాకు సైన్ చేయలేదు అజయ్ భూపతి. ప్రస్తుతం తన రెండో సినిమా కోసం కథను సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ దర్శకుడు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.

అజయ్ చాలా కాలంగా ప్రేమిస్తున్న శిరీష అనే అమ్మాయిని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోబుతున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శిరీష గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి. ఈ నెల 25న వీరిద్దరి వివాహం పెద్దల సమక్షంలో హైదరాబాద్ లోనే జరగనుంది.