ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న హీరో కార్తికేయ నుంచి మరో చిత్రం విడుదలకు సిద్ధమైంది. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను శిష్యుడు జంద్యల దర్శకత్వం వహించిన గుణ 369 ఇటీవల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఫైనల్ గా సినిమాను ఆగస్ట్ 2న రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. 

ఆర్ఎక్స్ 100 సినిమా సక్సెస్ కావడంతో వరుసగా వచ్చిన అవకాశాల్ని మిస్ చేసుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కార్తికేయకు ఈ సినిమా రిజల్ట్ కీలకం కానుంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన హిప్పీ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజైన హిప్పీ ఎక్కడా కూడా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయింది. 

దీంతో తన ఆశలన్నీ ఈ కుర్ర హీరో గుణ 369పైనే పెట్టుకున్నాడు. మాస్ మసాలా అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని కార్తికేయ ధీమాగా ఉన్నాడు. కానీ హిప్పీ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాకు పెద్దగా బజ్ లేకుండా పోయింది. అందుకే ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాలని రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమా కార్తికేయకు ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.