పెద్ద సినిమాలకు ధీటుగా 'Rx 100' రేంజ్ చూశారా..?

RX100 Gets Decent Release In USA
Highlights

120కి పైగా లోకేషన్లలో ఈ సినిమా విడుదల కానుండం విశేషం. అమెరికాలో వందకు పైగా లోకేషన్స్ లో సినిమాను విడుదల చేయడమంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ అగ్ర హీరోలకు మాత్రమే ఈ రేంజ్ ఉంటుంది.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్ భూపతి దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం 'Rx 100'. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేయగలిగింది. డైరెక్టర్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ ఇలా సినిమాకు పని చేసిన దాదాపు అందరూ కూడా కొత్తవారే. కానీ ఈ సినిమాకు కావల్సినంతే క్రేజ్ ను అయితే తీసుకురాగలిగారు.

ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ వారంలో చిరంజీవి అల్లుడు నటించిన 'విజేత', అలానే కార్తి నటించిన 'చినబాబు' విడుదలకు సిద్ధంగా ఉన్నా.. ఆ రెండు సినిమాలకు రాని క్రేజ్ ఈ చిన్న సినిమాకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నా.. అమెరికాలో మాత్రం స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా విడుదల చేయబోతున్నారు. 120కి పైగా లోకేషన్లలో ఈ సినిమా విడుదల కానుండం విశేషం. అమెరికాలో వందకు పైగా లోకేషన్స్ లో సినిమాను విడుదల చేయడమంటే మామూలు విషయం కాదు.

టాలీవుడ్ అగ్ర హీరోలకు మాత్రమే ఈ రేంజ్ ఉంటుంది. అలానే హైప్ ఉండి ఆసక్తిని క్రియేట్ చేసిన 'క్షణం','అర్జున్ రెడ్డి' వంటి సినిమాలు కూడా ఇలానే విడుదలయ్యాయి. ఈ సినిమా ప్రోమోలు, పోస్టర్లు అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ రేంజ్ లో స్క్రీన్లు దొరికాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే స్క్రీన్లు పెరిగే అవకాశం కూడా ఉంది. 

loader