Asianet News TeluguAsianet News Telugu

'RX100': పాయల్ అందాలు ఎన్ని కోట్లు తెచ్చాయంటే..

మంగళవారం నాడు కూడా ఆంధ్ర, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో కలిపి రూ.80 లక్షలు వసూలు చేసింది. ఆరు రోజులు మొత్తం గ్రాస్ చూసుకుంటే రూ.14 కోట్లు వసూళ్లు సాధించాయి. మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.15 కోట్ల రేంజ్ చూపిస్తుందని అంచనా వేస్తున్నారు

RX100 collections: 14 crores in 6 days

గత వారంలో విడుదలైన 'RX100' సినిమా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. మొదట మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా దూకుడు ప్రదర్శిస్తోంది. వీకెండ్ కు రూ.5కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా సోమవారం కూడా అదే క్రేజ్ కంటిన్యూ చేయగలిగింది. మంగళవారం నాడు కూడా ఆంధ్ర, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో కలిపి రూ.80 లక్షలు వసూలు చేసింది.

ఆరు రోజులు మొత్తం గ్రాస్ చూసుకుంటే రూ.14 కోట్లు వసూళ్లు సాధించాయి. మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.15 కోట్ల రేంజ్ చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సత్తా చాటింది. అయితే ఈ సక్సెస్ కు కారణం దర్శకుడు క్లైమాక్స్ లో రాసుకున్న ట్విస్ట్ లు, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హద్దులు మీరు చేసిన అందాల ప్రదర్శన అనే చెప్పాలి.

పాయల్ అందాల కోసం యూత్ రిపీటెడ్ గా ఈ సినిమాను చూస్తున్నారు. ఈ సినిమాకు మెయిన్ అసెట్ పాయల్ అనే చెప్పాలి. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఆమెకు మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios