కలెక్షన్లలో కూడా దుమ్మురేపుతోంది!

rx 100 movie first day collections
Highlights

సినిమా పోస్టర్లు, ట్రైలర్లతో అంచనాలు పెంచేసిన 'Rx 100' సినిమాకు తొలిషోతో మిశ్రమ స్పందన లభించినప్పటికీ రెండో షో నుండి సినిమాపై పాజిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. యూత్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. 

సినిమా పోస్టర్లు, ట్రైలర్లతో అంచనాలు పెంచేసిన 'Rx 100' సినిమాకు తొలిషోతో మిశ్రమ స్పందన లభించినప్పటికీ రెండో షో నుండి సినిమాపై పాజిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. యూత్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. రూ.2.70 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అయితే తొలిరోజే రూ.1.41 కోట్లు షేర్ రాబట్టడం విశేషం. మొదటి రోజే ఈ రేంజ్ లో కలెక్ట్ చేసిందంటే.. ఈ వీకెండ్ లో సినిమా లాభాల దిశగా ముందుకు సాగడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

చిన్న సినిమాకు ఈ రేంజ్ లో ప్రేక్షకాదరణ లభిస్తుండడం.. అటు మేకర్స్ కు ఇటు పంపిణీదారులకు మంచి ప్రాఫిట్ తీసుకురావడంతో రిజల్ట్ పట్ల అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, వైజాగ్ వంటి సిటీల్లో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమాలో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, శ్రుతిమించి శృంగారం చూడడానికే యువత థియేటర్లకు పరుగులు తీస్తున్నారని ఈ సినిమాపై కామెంట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. 

ఏదైతేనేం మేకర్స్ ఎవరిని టార్గెట్ చేసి సినిమా తీశారో.. వారికి సినిమా కనెక్ట్ అయింది. పైగా కలెక్షన్ల పరంగా ప్రాఫిట్స్ తీసుకొస్తోంది. ఈ వారంలో విడుదలైన సినిమాలతో పోలిస్తే అన్నింటిలో Rx 100' ముందంజలో ఉంది. ఈ సినిమాతో ఇండస్ట్రీకి అజయ్ భూపతి అనే నూతన దర్శకుడు, కార్తికేయ అనే హీరో పరిచయమయ్యారు. 
 

loader