నూతన నటుడు కార్తీకేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరో హీరోయిన్లుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్‌ ఎక్స్‌ 100.  ఈ సినిమాకు డివైడ్‌ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. యూత్‌ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండటంతో  మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం దర్శకుడు, హీరో ఇద్దరూ బిజీ అయ్యిపోయారు. అయితే హీరోయిన్ మాత్రం తెలుగులో ఒక్క సినిమాను ఓకే చేయలేదు. దాంతో అందరి దృష్టీ పై ఆమెపై పడింది.

 ఆర్ ఎక్స్ 100 లో కోరికతో రగిలిపోతూ, లోలోపల కుట్రలు చేసే పాత్రలో హీరోయిన్ పాయల్ రాజ్ అద్భుతంగా నటించింది. ఆమె పూర్తి స్దాయి బిజీ అవుతుందని అంతా భావించారు. అంతేకాదు కొన్ని  వెబ్ సైట్స్ పాయల్ రాజ్‌పుత్ ఇప్పటికే మహేష్ సినిమాకి ఎంపికైనట్టు రాసేసాయి. 

మరో ప్రక్క స్టార్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్‌ ఈ అమ్మడిని తన సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు ప్రచారం చేసారు. అయితే అవేమీ నిజం కాలేదు. ఆమె తన దాకా వచ్చిన ఏ అవకాసాన్ని మెటీరియలైజ్ చేసుకోలోకపోయింది. తెలుగులో అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయని ఆమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం. 


ఈ నేపధ్యంలో ఆమె ఓ తమిళ సినిమా కమిటైనట్లు సమాచారం. ఈ విషయమై ఆమె ట్వీట్ చేసి కన్ఫర్మ్ చేసింది.  ఆ సినిమా పేరు ఏంజిల్. ఉదయనిధి స్టాలిన్ సరసన ఆమె నటించబోతోంది.  ఆ సినిమా హిట్ అయితే అక్కడ పూర్తి స్దాయి బిజీ అయిపోతుందనేది నిజం.   దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.