Asianet News TeluguAsianet News Telugu

స్పీడ్ పెంచిన ఆర్ఎక్స్ 100 హీరో!

ఆర్ఎక్స్ 100 అందించిన విజయంతో మనోడి స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో బడా నిర్మాతలు అతనితో సినిమా చేయడానికి అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు. 

RX 100 hero upcoming projects
Author
Hyderabad, First Published Oct 16, 2018, 4:14 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగాలంటే కష్టపడే గుణంతో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. కరెక్ట్ గా ఆడియెన్స్ కి టచ్ అయ్యే కథను ఎంచుకొని సక్సెస్ కొడితే మంచి గుర్తింపు అందుతుంది. ఆ విధంగానే మరో రెండు హిట్స్ అందితే ఈజీగా క్రేజ్ అందుకోవచ్చు. ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ అలానే చేస్తున్నాడు. 

 

ఆర్ఎక్స్ 100 అందించిన విజయంతో మనోడి స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో బడా నిర్మాతలు అతనితో సినిమా చేయడానికి అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు - తమిళ్ హిప్పీ అనే ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు.TN.కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను  కలైపులి థాను నిర్మిస్తున్నారు. 

అసలు విషయంలోకి వస్తే.. కార్తికేయ మరో డిఫరెంట్ ఎంటర్టైనర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మల్లిఖార్జున్ అనే యువకుడు దర్శకుడుగా పరిచయం కానున్న ఆ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు.

ఆయన ఇంతకుముందు ముందు సాహసం శ్వాసగా సాగిపో - జయ జానకి నాయక సినిమాలను నిర్మించారు. ఇక ఇప్పుడు ఆర్ఎక్స్ 100 హీరోతో సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. మరి కార్తికేయ తన నెక్స్ట్ సినిమాలతో ఏ స్థాయిలో విజయాల్ని అందుకుంటాడో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios