ఈ సారి సర్పైజ్ హిట్స్ లో  'ఆర్ ఎక్స్ 100' ఒకటి. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాతో హీరోగా కార్తికేయ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ సినిమా తరువాత ఫుల్ బిజి అయ్యిపోయారు కార్తికేయ. తన తదుపరి సినిమాకి సంబంధించిన పనుల్లో కార్తికేయ బిజీగా వున్నాడు. ఆ బిజీలోనే ఖాళీ చేసుకుని ఆయన అభిమానులతో లైవ్ చాట్ ను నిర్వహించాడు. 

ఈ సందర్భంలోనే ఒక అభిమాని రామ్ చరణ్ పై అభిప్రాయం చెప్పమని కార్తికేయని అడిగాడు. అప్పుడు కార్తికేయ పాజిటివ్ గా  స్పందిస్తూ .. "రామ్ చరణ్ చాలా గొప్ప డాన్సర్ .. మంచి ఆర్టిస్ట్. చిరంజీవి కొడుకుననే గర్వం ఆయనలో కొంచెం కూడా కనిపించదు. ప్రతి సీన్  అనుకున్నట్టుగా రావడానికి ఆయన చాలా కష్టపడుతుంటాడు. చిరంజీవి కొడుకైన ఆయనే అంతగా కష్టపడుతుంటే, మనం ఇంకెంత కష్టపడాలి? అనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకొచ్చారు. 

ఇది విన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ నిజమే అంటూ కార్తికేయను మెచ్చుకుంటున్నారు.  అదే లైవ్ ఛాట్ లో  మరో అభిమాని గీతా గోవిందం తో సూపర్ హిట్ కొట్టిన  విజయ్ దేవరకొండ గురించి చెప్పుమనగా, ' ఎవరికైనా ...ఏదైనా సాధ్యమే .. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చు' అనే ఆశాభావాన్ని విజయ్ దేవరకొండ నుంచి నేర్చుకోవచ్చు. ఆయనలో అభిమానులకి నచ్చింది కూడా ఇదే' అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అందరి హీరోలతో మంచిగా పద్దతిగా ఉండటానికి ట్రై చేస్తున్నాడు కార్తికేయ అంటున్నారు ఈ కామెంట్స్ విన్నవారు.