ఫారెన్ కు చెందిన నటులు భారతీయ చిత్రాల్లో నటించేందుకు ఇక్కడికి వస్తుంటారు. కళకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రష్యా నుంచి బతుకుదెరువు కోసం ఓ చిత్రం నటించేందుకు వచ్చిన నటుడు మృతి చెందాడు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. 

అలెక్స్ సెండర్(38) అనే నటుడు టూరిస్ట్ వీసాపై ఓ చిత్రంలో నటించేందుకు రష్యా నుంచి హైదరాబాద్ వచ్చాడు. డిఎల్ఎఫ్ బిల్డింగ్ వద్ద అకస్మాతుగా అతడు సృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతడిని కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అలెక్స్ బుధవారం మరణించాడు. 

అలెక్స్ మృతికి ఇక్కడి వాతావరణ పరిస్థితులే కారణం అని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు మండిపోతున్నాడు. తీవ్రమైన వేడితో అలెక్స్ వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే గుండెపోటు కూడా రావడం అతడి మృతికి కారణం అని వైద్యులు తెలిపారు. 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి