Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి రిలీజ్ ల రన్ టైమ్ లు, ఏ సినిమాకు ప్లస్, దేనికి మైనస్?

 స్టార్స్ సినిమాలకు రన్ టైమ్ కూడా ఓ కీలకమైన అంశంగా మారింది.  ఎక్కువ,తక్కువ రన్ టైమ్ లు సైతం రిజల్ట్ పై భారీగా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సంక్రాంతి చిత్రాల రన్ టైమ్ లు బయిటకు వచ్చాయి.  
 

Runtimes locked for Waltair Veerayya and Veera Simha reddy
Author
First Published Dec 30, 2022, 6:24 AM IST


సంక్రాంతి సినిమా సందడి మొదలైపోతోంది. మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి స్పెషల్ సినిమాలు అభిమానులను ఊపేయనున్నాయి. ఈ  సీజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతికి వచ్చే సినిమాలకు మినిమం గ్యారెంటీ ఓపినింగ్స్ ఉంటాయి. దాంతో  స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ చేయడానికి అదే పర్ఫెక్ట్ టైం అని చాలామంది దర్శక నిర్మాతలు నమ్ముతారు. అందుకే ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కొన్ని నెలల ముందే తమ సినిమాలను అనౌన్స్ చేసేసారు. 

ప్రతిసారిలానే ఈసారి కూడా బాక్సాఫిస్ వద్ద భారీపోటి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ తో పాటు తమిళ స్టార్ హీరోస్ అజిత్ & విజయ్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. అలాగే స్టార్స్ సినిమాలకు రన్ టైమ్ కూడా ఓ కీలకమైన అంశంగా మారింది.  ఎక్కువ,తక్కువ రన్ టైమ్ లు సైతం రిజల్ట్ పై భారీగా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సంక్రాంతి చిత్రాల రన్ టైమ్ లు బయిటకు వచ్చాయి. అవేమిటో చూద్దాం..

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీరసింహ రెడ్డి చిత్రం 2 గంటల 40 నిముషాల రన్ టైమ్ 
 వాల్తేరు వీరయ్య చిత్రం రన్ టైమ్ విషయానికి వస్తే.. 2 గంటల 35 నిముషాల రన్ టైమ్
విజయ్ వారసుడు చిత్రం రన్ టైమ్ చూస్తే.. 2 గంటల 43 నిముషాల రన్ టైమ్ 
అజిత్ తెగింపు( తునివు) చిత్రం  రన్ టైమ్ .. 2 గంటల 23 నిముషాల రన్ టైమ్ తో రానున్నాయి. 

అయితే ఈ చిత్రాలకు సెన్సార్ జరగలేదు. కాబట్టి అఫీషియల్ సమాచారం మాత్రం కాదు. 

 
 ఈ చిత్రాలలో మొదట అజిత్ నటిస్తున్న "తునివు" చిత్రం జనవరి 11న విడుదల కానుంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ గా కనిపించనుంది. రీసెంట్ గా ఈ చిత్రం లో ఓసాంగ్ కూడా పాడింది మంజూ. 1987లో జరిగిన లూథియానా బ్యాంక్ దోపిడీ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. 

అలాదే దిల్ రాజు నిర్మిస్తున్న  ఇళయదళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం వారసుడు. తమిళంలో వారిసు పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. 

 నందమూరి బాలకృష్ణ నటిస్తున్న "వీర సింహ రెడ్డి" చిత్రం అదే రోజున రిలీజ్ కానుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు బాలకృష్ణతో నటించిన శృతిహాసన్ కు మాత్రం బాలయ్య బాబుతో ఇది మొదటి సినిమా కావడం విశేషం.

దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

  అన్నిటికంటే చివరగా రిలీజ్ అవ్వబోతున్న సినిమా "వాల్తేరు వీరయ్య".  మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య చిత్రం పై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. పూనకాలు లోడింగ్ అనే ఈ పాటలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నాడు. ఈ హుషారైన గీతాన్నిఈ రోజురిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. మెగాస్టార్ × మాస్ మహారాజా = పూనకాలు లోడింగ్ అంటూ పాటపై అంచనాలు పెంచేసింది.  వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటికే బాస్ పార్టీ, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్, శ్రీదేవి చిరంజీవి సాంగ్ విడుదలై అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు మెగా స్పందన వస్తోంది. 

వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ కథానాయిక. ఇందులో రవితేజ ఓ పవర్ ఫుల్ రోల్ పోషిస్తుండగా, కేథరిన్ ట్రెసా కీలకపాత్రలో కనిపించనుంది.

ఈ పెద్ద చిత్రాల అన్నింటి తర్వాత ఒక చిన్న చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. అదే "విద్యా వాసుల అహం". ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెల్లవారితే గురువారం సినిమా దర్శకుడు "మణికాంత్ గెల్లి" ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో ల కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 14న విడుదలకు సిద్దమవుతుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios