సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న డెబ్యూ మూవీ 'ఉప్పెన'. ఈ చిత్రంలో వైష్ణవ్ కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నిర్మాణంలో తెరక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ కథ అందిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. 

విభిన్నమైన కథతో తెరక్కుతున్న ఈ చిత్రంపై అప్పుడే పుకార్లు మొదలయ్యాయి. ఈ చిత్రంలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతవరకు విజయ్ సేతుపతి షూటింగ్ లో పాల్గొనక పోవడంతో వేగంగా ఈ రూమర్లు వ్యాపించాయి. 

విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదట. అందుతున్న సమాచారం మేరకు విజయ్ సేతుపతి షూటింగ్ లో పాల్గొనే షెడ్యూల్ ఆగష్టు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చిత్ర కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో జాలరి పాత్రలో నటిస్తున్నాడు. ఉప్పెన చిత్రం పై నెలకొన్న గందరగోళం తొలగాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.