ఒక సినిమా రిలీజ్ కు రెడీగా ఉందంటే అందరికంటే ఎక్కువగా నిర్మాత దర్శకుడిలో చాలా టెన్షన్స్ మొదలవుతుంది. ముఖ్యంగా దర్శకుడికి సినిమా రిలీజ్ డేట్ తెలియని భయాన్ని కలుగజేస్తుంది. సినిమా ఎంత సంతృప్తిగా వచ్చినా రిలీజ్ అయ్యేవరకు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. 

అయితే సంచలన దర్శకుడు శంకర్ 2.0 రిలీజ్ ని అంత సిరియస్ గా తీసుకోవడం లేదని టాక్ వస్తోంది. పూర్తిగా నిర్మాతనే రిలీజ్ అండ్ ప్రమోషన్స్ వ్యవహారాలను చూసుకుంటున్నాడు. అయితే శంకర్ తన దృష్టిని మొత్తం కమల్ హాసన్ తో చేయనున్న భారతీయుడు 2 పైనే ఉంచాడని కథనాలు వెలువడుతున్నాయి. 

2.0 సినిమా కోసం 500 కోట్లకు పైగా ఖర్చు చేయించిన శంకర్ ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే భారతీయదు సీక్వెల్ ను ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేసాడు. కమల్ పొలిటికల్ కెరీర్ ను ద్రుష్టి లో ఉంచుకొని కథలో మార్పులు కూడా చేశాడు. ఇక మరో పాత్ర కోసం శింబును కూడా సంప్రదించాడు.అలాగే సరికొత్త సేనాపతిగా కమల్ ను చూపించడానికి ఈ మధ్యనే కొన్ని లుక్స్ ని డిజైన్ చేసి ఫైనల్ చేశాడు. 

సెట్స్ వర్క్స్ కూడా దాదాపు ఫినిష్ అయ్యాయి. మొత్తంగా ఒక సినిమా పూర్తి చేసి గాని ,ఆరో సినిమా జోలికి వెళ్లని శంకర్ ఇప్పుడు 500 కోట్ల ప్రాజెక్టు రిలీజవుతుంటే ఏ మాత్రం టెన్షన్ లేకుండా నెక్స్ట్ సినిమా పనులపై ద్రుష్టి పెట్టినట్లు కోలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.మరి శంకర్ ఆ రూమర్స్ కి ఏ విధంగా ఆన్సర్ ఇస్తాడో చూడాలి.