హీరో రాజశేఖర్ పై రూమర్స్: క్లారిటీ ఇచ్చిన తారా చౌదరి

Rumors on Rajaseklhar: Tara Chowwdary clarifies
Highlights

తారా చౌదరి పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారింది. సెక్స్ స్కామ్ విషయంలో ఆమెపై వివాదం చెలరేగింది. 

హైదరాబాద్‌: తారా చౌదరి పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారింది. సెక్స్ స్కామ్ విషయంలో ఆమెపై వివాదం చెలరేగింది. ఆ సమయంలోనే హీరో రాజశేఖర్ కు, ఆమెకు మధ్య లింక్ పెడుతూ ఊహాగానాలు ప్రచారమయ్యాయి. ఆ రూమర్స్ పై తారా చౌదరి తాజాగా వివరణ ఇచ్చింది.

 హీరో రాజశేఖర్ అంటే తనకు ఎంతో అభిమానమని, తాను సినీ ఇండస్ట్రీకి రాక మునుపు మా అన్నయ్య అనే సినిమా చూశానని, ఆ సినిమా చాలా బాగా నచ్చిందని, అందులో అన్నయ్య సెంటిమెంట్ నచ్చిందని చెప్పింది. 

తమ్ముడిని ఎలా చూస్కోవాలి అనే సీన్లు తనకు బాగా నచ్చాయని, తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ టైంలో రాజశేఖర్‌ను కలిసి మీరంటే నాకు అభిమానమని.. మీరు నటించిన మా అన్నయ్య అనే సినిమా బాగా నచ్చిందని చెప్పానని, దానికి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారని వివరించారు.

 ఆ తర్వాత తాను హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో తాను ఉంటున్న ఫ్లాట్ పక్కన ఓ ఫ్లాట్ ఖాళీగా ఉంటే చూసేందుకు రాజశేఖర్, జీవిత ఇద్దరూ వచ్చి చూశారని, అలా కొన్ని సందర్భాల్లో ముఖ పరిచయం తప్పితే ఇంకోటేమీ లేదని, రాజశేఖర్ పై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధాలని ఆమె వివరించింది.
 
"ఆయన చాలా మంచి మనిషి. రాజశేఖర్, జీవిత ఇద్దరూ వ్యక్తిగతంగా చాలా గుడ్ పర్సన్స్. బయట ఏవేవో రూమర్స్ వస్తున్నాయి.. అవన్నీ వాస్తవాలనీ నేను అనుకోవట్లేదు. వాళ్లు నాకు ఎదురుపడినప్పుడు మాట్లాడుకుంటాం అంతే" అని చెప్పింది. 

"ఓ షూటింగ్ సమయంలో రాజశేఖర్, జీవితతో కలిసి నేను సెల్ఫీ కూడా దిగాను. దాన్ని చూసి నన్ను రకరకాలుగా బ్లేమ్ చేశారు. అంతే అంతకుమించి ఏమీ లేదు" అని తారా చౌదరి స్పష్టం చేసింది.

loader