టాలీవుడ్ లో ఊహించని విధంగా సక్సెస్ అందుకున్న హీరోల్లో సంపూర్ణేష్ బాబు ఒకరు. రెగ్యులర్ గా వెళితే రొటీన్ అని డిఫరెంట్ కామెడీ యాంగిల్ లో హృదయ కాలేయం సినిమాతో వచ్చి సక్సెస్ అందుకున్నాడు.ఆ సినిమాతో దర్శకుడు స్టీవెన్ శంకర్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

అయితే అదే కాంబినేషన్ లో మళ్ళీ కొబ్బరిమట్ట సినిమా తెరకెక్కింది. మొదటి సినిమాను తెరకెక్కించడానికి అష్టకష్టాలు పడ్డ ఆ చిత్ర యూనిట్ రెండవ సినిమాను స్పీడ్ గానే ముగించేసింది. అయితే ఎందుకోగానీ సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. మధ్య మధ్యలో టీజర్ అండ్ పోస్టర్స్ తో కాస్త హడావుడి బాగానే చేశారు. ప్రెస్ మీట్ లు కూడా బాగానే నిర్వహించారు.
అయితే ఏం జరిగిందో ఏమో మరి రిలీజ్ కు రెండు మూడు రోజులు ఉంది అనగా సైలెంట్ అయిపోయారు. అసలైతే ఫైనల్ గా నవంబర్ సినిమా రానుందని చెప్పినా సినిమా విడుదల కాలేదు. ఆర్థిక ఇబ్బందులు అయ్యి ఉండవచ్చని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ఇక ఇటీవల పలు వెబ్ సైట్లలో సినిమాను ఎండ్ చేసి రిలీజ్ చేయకుండా పలు వివాదాల కారణంగా చంపేశారు అనే విధంగా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.