Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి మంచి పోటీ ఇస్తూ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇద్దరికీ ఇష్టం లేకపోయినా, అనుకోని పరిస్థితులలో భార్యాభర్తలు అయిన ఒక జంట కదా ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

ఎపిసోడ్ ప్రారంభంలో నా వాళ్ళ ముందే నన్ను ఇరికించావు కదా నీ పని చెప్తాను అనుకుంటుంది రుద్రాణి. ఈ పిల్లకి ఎంత ధైర్యం ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా ఎలా తట్టుకుంటుంది అనుకుంటుంది ధాన్యలక్ష్మి. ఇక్కడ నుంచి స్కిప్ అవ్వాలి అనుకుంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. నువ్వు ఎక్కడికి.. నీతో మాట్లాడాలి అంటూ ఆపుతుంది అపర్ణ.

పిల్లలందరినీ అక్కడినుంచి వెళ్ళిపోమంటుంది. రాజ్ కూడా వెళ్ళిపోబోతుంటే నీకు పెళ్లి అయింది. ఇంట్లో ఏం జరుగుతుందో నీకు కూడా తెలియాలి అంటూ ఎందుకింత పని చేశావు, నా కొడుకు జీవితంతో ఎందుకు ఆడుకున్నావు అని రుద్రాణిని నిలదీస్తుంది అపర్ణ. చెప్పాను కదా ఈ ఇంటి పరువు కోసమే అని అంటుంది రుద్రాణి. ఆమె చెంప పగలగొడుతుంది అపర్ణ.

ఇదే చెంప దెబ్బ అందరి ముందు కొట్టి ఉంటే జీవితాంతం తలెత్తుకోలేవని ఓపిక పట్టాను అంటుంది అపర్ణ. ఇదంతా రేఖ దొంగచాటుగా చూస్తుంది. మరోవైపు భార్య కోసం ఎదురుచూస్తూ.. చెప్పినా వినకుండా వెళ్ళింది అంటాడు కృష్ణమూర్తి. చెప్పిన మాట వినకపోతే దానికి మనం ఏం చేస్తాం అంటుంది అప్పు. నా భార్యని ఒక మాటంటే నాకు మాత్రం అవమానం కాదా బాధ కాదా అంటాడు కృష్ణమూర్తి.

అక్కడ ఉన్నది కావ్య తల్లిని ఒక మాట పడనివ్వదు నువ్వు టెన్షన్ పడొద్దు అంటుంది కృష్ణమూర్తి వదిన. ఇంతలోనే కనకం రావటంతో ఆమెకి ఎదురెళ్తారు తండ్రి కూతుర్లు. తను బాగుందా మమ్మల్ని అడిగిందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అడక్కుండా ఎలా ఉంటుంది. వాళ్లు కాదని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు అంటుంది కనకం.

వాళ్లు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారా నువ్వు మా చెవుల్లో పువ్వులు పెడుతున్నావా నిజం చెప్పు అంటుంది అప్పు. నిన్నేమీ అనలేదా అల్లుడుగారు నీతో మాట్లాడారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు కృష్ణమూర్తి. అన్నింటికీ సమాధానాలు చెప్తుంది కనకం. నీ నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి నిజం చెప్పు అని నిలదీస్తాడు కృష్ణమూర్తి.

నోటికి వచ్చినన్ని అబద్ధాలు ఆడే నేను మొదటిసారి అబద్ధం చెప్పటానికి తడబడుతున్నాను అనుకుంటూ అలసిపోయాను స్నానం చేయాలి అనుకుంటూ అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది కనకం. అక్కడ ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి అంటాడు కృష్ణమూర్తి. మరోవైపు నిన్ను సొంత మనిషిలాగ చూసుకున్నాము కానీ నీ బుద్ధి చూపించావు అంటుంది అపర్ణ. ఇదంతా ఏంటి మమ్మీ అంటాడు రాజ్.

ప్రతి ఇంట్లోని కొన్ని రహస్యాలు ఉంటాయి. నువ్వు పెద్దవాడివి అయ్యావు కాబట్టి ఈరోజు ఈ రహస్యాన్ని నీ దగ్గర బయట పెడుతున్నాను అంటూ నువ్వు ఈ ఇంటి ఆడపడుచువా అని రుద్రాణిని అడుగుతుంది అపర్ణ. నీ తల్లి తండ్రి ఎవరు మీ వంశం ఏం వంశం. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చి పెట్టామో మర్చిపోయావా అంటూ రుద్రాణిని నిలదీస్తుంది. మీ తాతయ్య మంచితనం వల్ల ఈ పరాయి మనిషి మన ఇంట్లో ఆడపడుచు హోదా వెలగబెడుతుంది.

అంతేతప్ప మన రక్తం కాదు అంటూ రాజ్ కి చెప్తుంది అపర్ణ. ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజ్. ఈమె తండ్రి మీ తాతయ్య దగ్గర నమ్మకంగా పనిచేసే వ్యక్తి ఆయన చావు బతుకుల్లో ఉన్నప్పుడు తన బాధ్యత తీసుకుంటానని మీ తాతయ్య మాటిచ్చారు. ఆ మాట మీదే ఇంటికి తీసుకువచ్చి కన్ను కూతురు లాగా చూసుకున్నారు. ఈ విషయం ఇప్పటివరకు నా కొడుకుతో కూడా చెప్పలేదు నువ్వు చాలాసార్లు ఈ ఇంటికి మహారాణి లాగా ప్రవర్తించిన జాలితో వదిలిపెట్టాము.

ఇప్పటివరకు పిల్లలకు కూడా తెలియదంటే నీ మీద ఎంత గౌరవమో ఆలోచించు అంటుంది అపర్ణ. ఇంక చాలు నన్ను ఏంటి ఆడపడుచు లాగా పెంచారు అందుకే ఈ ఇంటి ఆడపడుచు గా కుటుంబ గౌరవం కాపాడటం కోసమే ఆ అమ్మాయిని పెళ్లి పీటల మీద కూర్చో పెట్టాను దానికి దక్కిన ప్రతిఫలం ఇదా నా మీద చేయి చేసుకున్నావు ఒకప్పుడు నా తండ్రి ఈ కుటుంబం కోసమే తన జీవితాన్ని ధారబోశాడు దానికి ఇదా బహుమతి అంటూ కేకలు వేస్తుంది రుద్రాణి.

ఎవరు ఎవరికి మేలు చేశారు అనేది నువ్వే చెప్పాలి మరి, ఉద్యోగాన్ని నిజాయితీగా చేయడం త్యాగం అనుకుంటే దానికి మేమేమీ చేయలేము. అయినా ఎంత పెద్ద విషయాన్ని కొత్త కోడలు బయటపెట్టే వరకు నువ్వు బయటపడలేదు అంటే ఇది నువ్వు కావాలనే చేసావనిపిస్తుంది అంటుంది చిట్టి. సాయంత్రం రిసెప్షన్ అని వెడ్డింగ్ కార్డులు వేయించాము సాయంత్రం గెస్ట్ లందరూ వస్తారు అంటుంది ధాన్యలక్ష్మి. ఈ దొంగ పెళ్ళికి రిసెప్షన్ కూడానా అంటుంది అపర్ణ. 

పిలిచి రావద్దని చెప్తామా ఎంత పరువు నష్టం దుగ్గిరాల వంశానికి ఎంత అప్రతిష్ట. మీ మావయ్య గారికి తెలిస్తే అసలు ఊరుకోరు రిసెప్షన్ జరిగి తీరుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడండి అంటూ ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది చిట్టి. నన్ను ఇంత అవమానిస్తావా జన్మలో మర్చిపోను ఇంతకీ ఇంత అనుభవించేలాగా చేస్తాను అని కోపంతో రగిలిపోతుంది రుద్రాణి. మరోవైపు కావ్య గదికి వచ్చిన చిట్టి మీ అమ్మని అన్ని మాటలు అన్నందుకు బాధపడుతున్నావా.

ఒకటి ఆలోచించు మీ అమ్మ అన్ని అబద్ధాలు చెప్పటంలో అర్థం లేదు మా వాళ్ళు మీ అమ్మని అన్ని మాటలు అనటంలోనూ అర్థం లేదు. కళ్ళల్లో నీళ్ళని మనసులో బాధని తుడిచేయ్. సాయంత్రం రిసెప్షన్ ఉంది రెడీ అవ్వు అని నగలని ఇస్తుంది చిట్టి. కోడలుగా అందరికీ పరిచయం చేస్తారా, కానీ ఇవన్నీ వేసుకునే అర్హత నాకు లేదు. ఈ వంశం ఈ మనుషులు వేటితోను సరితూగలేను, అయినా నాకు ఈ ఆడంబరాలు నచ్చవు అంటుంది కావ్య.

ఇవి ఆడంబరాలు కాదు ఆనవాయితీ అయినా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుసు ఈరోజు నీకు మీ అమ్మకి అవమానం జరిగింది కరెక్టే కానీ దాన్ని పదిమందిలోనే చూపిస్తావా, ఏంటి పెద్ద కోడలుగా పరువు కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా అంటుంది చిట్టి. మీ డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో చీరలు, నగలే చూస్తారా ఆ మనిషి మనసుతో నీకు సంబంధం లేదా అంటుంది కావ్య.

అంతలోనే అక్కడికి వచ్చిన రాజ్ మీరు వెళ్లండి తనతో ఎలాగా నగలు వేయించాలో నాకు తెలుసు అంటాడు. మళ్లీ గొడవపడితే బాగోదు అంటుంది చిట్టి. గొడవ పడను అని మాట ఇవ్వటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిట్టి. నగలు వేసుకోమని ఇస్తాడు రాజ్ వద్దు అంటుంది కావ్య. ముసుకు మాత్రం వేసుకుంటావేం అంటాడు కోపంగా. అమ్మమ్మగారికి మీరు ఏదో మాట ఇచ్చినట్లున్నారు అంటుంది కావ్య.

సాయంత్రం రిసెప్షన్ ఉంది నా కర్మకొద్దీ నిన్ను వాళ్ళందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారు అంటాడు నా కర్మకొద్దీ నేను రాను అంటుంది కావ్య. బ్రతిమలాడించుకుంటున్నావా అంటాడు రాజ్. మీరు బ్రతిమిలాడే రకమా, అందులోని నన్ను అంటూ వెటకారంగా మాట్లాడుతుంది కావ్య. నాకు కాస్త మనశ్శాంతి కావాలి అంటుంది కావ్య ఏం చేస్తే వస్తుంది అంటాడు మీరు ఎక్కడి నుంచి వెళ్తే వస్తుంది అంటుంది కావ్య.

నాకోసం నీకోసం కాదు జనాలు కోసం వీటిని తీసుకొని నీ అలంకరణ పెంచుకో అంటాడు రాజ్. మీ అహంకారాన్ని తగ్గించుకుంటారా, వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఒక హక్కే కాబట్టి నేను అక్కడికి రాను అంటుంది కావ్య. రాకపోతే బలవంతంగా నగలు వేయాల్సి వస్తుంది అంటాడు రాజ్. ఏ హక్కుతో నగలు వేస్తారు మీరు నన్ను భారీగా అంగీకరించారా అంటుంది కావ్య. ఆ పని ఎప్పటికీ జరగదు, ఈ ఇంటి పరువు తీయటమే నీకు ఆనందం అయితే నీకు నచ్చినట్లు చేసుకో అంటూ నగ విసిరేసి వెళ్ళిపోతాడు రాజ్.

 అయితే ఆ నగ నేరుగా కావ్య మెడలో పడుతుంది అప్పుడే వచ్చిన చిట్టి అది చూసి ఆనందిస్తుంది. మరోవైపు రాహుల్ ఫోన్ రీచ్ అవ్వకపోవడంతో అతని ఆఫీస్ కి ఫోన్ చేసి అతనికి లైన్ కలపమంటుంది స్వప్న. అతను మూడు రోజుల నుంచి ఆఫీస్ కి రావటం లేదు అని స్టాఫ్ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాజ్ సర్ మ్యారేజ్ కదా స్టాఫ్ అందరికీ లీవ్ ఇచ్చారు ఈరోజు రాజ్ సార్ వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ కదా స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు అంటుంది ఆవిడ.

రాహుల్ కూడా అక్కడే ఉన్నాడా అని అడుగుతుంది స్వప్న. అవును ఉంటుంది ఆవిడ. ఫోన్ పెట్టేసిన స్వప్న రాహుల్ నాతో ఎందుకు అబద్ధం చెప్తున్నాడు ఆఫీస్ కి అని చెప్పి రాజ్ ఇంటికి వెళ్తున్నాడా అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది అనుకుంటుంది స్వప్న. మరోవైపు రాజ్ ప్రవర్తనకి బాధపడుతున్నావా నువ్వు పెళ్ళిలో చేరకుండా మూసుకు వేసుకున్నట్లు అతను కోపాన్ని ముసుగు వేసుకున్నాడు.

తొందర్లోనే ఆ ముసుగు తొలగిపోతుంది అని కావ్యకి నచ్చచెప్తుంది చిట్టి. తరువాయి భాగంలో రిసెప్షన్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు రాజ్. అక్కడికి వచ్చిన మీడియా మీరు ఇంత గ్రాండ్ గా రెడీ అయి వచ్చారు కానీ మీ లైఫ్ పార్టనర్ ని ఎందుకు తీసుకురాలేదు, అసలు తను వస్తుందా రాదా అని అడుగుతుంది న్యూస్ రిపోర్టర్.