నంది అవార్డుల ఎంపికపై ఏపీ సీఎంకు గుణశేఖర్ బహిరంగలేఖ

నంది అవార్డుల ఎంపికపై ఏపీ సీఎంకు గుణశేఖర్ బహిరంగలేఖ

ఏపీ సీఎం చంద్రబాబుకు మరోసారి లేఖాస్త్రం సంధించారు దర్శకుడు గుణశేఖర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల లిస్ట్ లో రుద్రమదేవికి చోటు దక్కకపోవడంతో ఆ చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ ప్రశ్నించడం తప్పా అంటూ ఓ లేఖను డైరెక్ట్ గా ఏపి సిఎం చంద్రబాబునే ప్రశ్నిస్తూ లేఖ రాశారు.

 

తెలుగుజాతి ఖ్యాతిని నలుమూలలా చాటిచెప్పిన రుద్రమదేవి సినిమాకు వినోదపు పన్ను రాయితి ఎందుకివ్వలేదు అని ప్రశ్నించడం తప్పా అంటూ మొదలు పెట్టి.. కనీసం ఉత్తమ చిత్రాల్లో మొదటి మూడు స్థానాల్లోనే కాదు స్పెషల్ జ్యూరీ అవార్డుకు కూడా అందుకోనందుకు ఆవేదన వ్యక్తం చేశాడు.

 

ఇలాంటి చిత్రాలను ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించారా.. అయితే రుద్రమదేవి సినిమా తీసినందుకు నన్ను క్షమించండి.. అంటూ తన బాధని లేఖ రూపంలో వెళ్లగక్కాడు గుణశేఖర్. గుణా టీం వర్క్స్ బ్యానర్లో ఎంతో కష్టపడి ఆ సినిమా తెరకెక్కించాడు గుణశేఖర్. తెలంగాణాలో ఆ సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇచ్చారు. 

 

అయితే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను రాయితి ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రుద్రమదేవికి మాత్రం ఇవ్వలేదు. అది ఎందుకు అని ప్రశ్నించినందుకే ఇప్పుడు నంది అవార్డుల్లో కూడా రుద్రమదేవికి ఒక్క అవార్డ్ కూడా లేకుండా చేశారని వాపోయాడు గుణశేఖర్. మరి గుణశేఖర్ వాదన కూడా సరైందే కదా.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos